Wedding: పెళ్లిలో క్యూఆర్‌ కోడ్‌తో కట్నాల చదివింపులు

Written by RAJU

Published on:

సాంకేతికత అత్యున్నత దశలో ఉన్న నేటి కాలంలో ప్రతీదీ డిజిటలైజేషన్‌ అయిపోతోంది.

Wedding: పెళ్లిలో క్యూఆర్‌ కోడ్‌తో కట్నాల చదివింపులు

వర్గల్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): సాంకేతికత అత్యున్నత దశలో ఉన్న నేటి కాలంలో ప్రతీదీ డిజిటలైజేషన్‌ అయిపోతోంది. ఇంతకాలం పెళ్లికి వచ్చిన బంధువులు పెళ్లికొడుకు, పెళ్లికూతురును ఆశీర్వదించడంతో పాటు రాతపూర్వకంగా కట్నాలు సమర్పించడం మామూలే. ప్రస్తుతం ట్రెండు మారింది.

సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం గౌరారంలో ఆదివారం జరిగిన ఓ పెళ్లి వేడుకలో పెళ్లికొడుకు, పెళ్లి కూతురు తరఫున కట్నాల చదివింపులను ఆన్‌లైన్‌లో స్వీకరించారు. క్యూఆర్‌ కోడ్‌ ద్వారా చదివింపులు తీసుకున్నారు. ఇది కాస్తా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Subscribe for notification