- ఈద్ ప్రార్థనల్లో పాలస్తీనా జెండా..
- విచారణ ప్రారంభించిన యూపీ పోలీసులు..

UP: ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా ఎలాంటి సమస్యలు లేకుండా రంజాన్ ముగిసింది. ఈద్ రోజు పలు ప్రాంతాల్లో యూపీ పోలీసులు భద్రతను పెంచారు. దీంతో పాటు రూడ్లపై నమాజ్ చేయొద్దని హెచ్చరికలు జారీ చేశారు. చిన్న చిన్న ఘర్షణలు మినహా యూపీలో ప్రశాంతంగా పండగ ముగిసింది.
Read Also: Addanki Dayakar Rao : బండి సంజయ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఫైర్
ఇదిలా ఉంటే, సహరాన్‌పూర్‌లో ఈద్ ప్రార్థనలు చేసిన తర్వాత ఒక గుంపు పాలస్తీనా జెండా ఊపుతూ నినాదలు చేయడం సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ఇది వైరల్ కావడంతో పోలీసుల దృష్టిలో పడింది. ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందిన ఎస్పీ వ్యోమ్ బిందాల్ తెలిపారు. కొంతమంది యువకులు వేరే దేశ జెండాను ఊపుతూ కనిపించిన వీడియో సోషల్ మీడియా ద్వారా మాకు తెలిసింది. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోందని, తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంబాలా రోడ్డులోని ఈద్గాలో నమాజ్ చేసిన తర్వాత కొంత మంది యువకులు పాలస్తీనా జెండాతో నినాదాలు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించే ప్రయత్నం జరుగుతోంది.