Watermelon Seeds: మీరూ పుచ్చకాయ తినేసి గింజలు విసిరేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా దాచేస్తారు..

Written by RAJU

Published on:

Watermelon Seeds: మీరూ పుచ్చకాయ తినేసి గింజలు విసిరేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా దాచేస్తారు..

పుచ్చకాయ, రసం, రుచి, అందులోని పోషక విలువలు అన్నీ ప్రత్యేకమైనవే. అందుకే అందరూ వీటిని ఎంతో ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా అందరూ పుచ్చకాయలోని ఎర్రటి భాగాన్ని తినేసి, దాని విత్తనాలు పడేస్తుంటారు. ఇది సాధారణంగా అందరూ చేసేదే. ముఖ్యంగా నోటిలో పుచ్చకాయ గింజలు పొరబాటున కొరికితే కొంచెం చిరాకు వస్తుంది కూడా. కానీ మీకూ తెలుసా పుచ్చ విత్తనాలు ఎన్ని రెట్లు పోషకమైనవో? ఇందులో మెగ్నీషియం, ఐరన్‌తో సహా వివిధ ప్రయోజనకరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ విత్తనాలను వేయించి తింటే ఎన్నో రెట్లు పోషక విలువలు లభిస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

మెగ్నీషియం

పుచ్చకాయ గింజలలో అనేక ఖనిజాలు ఉంటాయి. వీటిలో ఒకటి మెగ్నీషియం. 4 గ్రాముల విత్తనాలలో దాదాపు 21 మిల్లీగ్రాముల మెగ్నీషియం లభిస్తుంది. ఈ విత్తనాలు శరీర రోజువారీ మెగ్నీషియం అవసరాలలో 5 శాతం తీరుస్తాయి. అమెరికాలోని మేరీల్యాండ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) అధ్యయనం ప్రకారం.. రోజూ 420 మిల్లీగ్రాముల మెగ్నీషియం మనకు అవసరం అవుతుందని సిఫార్సు చేస్తోంది. మెగ్నీషియం నరాల, కండరాల పనితీరును నిర్వహించడానికి, అలాగే రోగనిరోధక శక్తి, గుండె, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా అవసరం.

ఐరన్

గుప్పెడు పుచ్చకాయ గింజలలో దాదాపు 0.29 మిల్లీగ్రాముల ఐరన్‌ ఉంటుంది. ఇది రోజువారీ అవసరాలలో 1.6 శాతాన్ని తీరుస్తుంది. పెద్దలకు రోజుకు 18 మిల్లీగ్రాముల ఐరన్‌ అవసరం. శరీరంలో ఆక్సిజన్‌ను తీసుకువెళ్ళే హిమోగ్లోబిన్‌లో ఐరన్‌ ఒక ముఖ్యమైన భాగం. ఇది శరీరం కేలరీలను శక్తిగా మార్చడంలో కూడా సహాయపడుతుంది. అయితే పుచ్చకాయ గింజలలో ఫైటేట్ ఉంటుంది. ఇది ఇనుము శోషణ, దాని పోషక విలువలను తగ్గించడంలో సహాయపడుతుంది.

జింక్

పుచ్చకాయ గింజలు జింక్ కు మంచి మూలం. గుప్పెడు (4 గ్రాములు) పుచ్చ గింజల్లో రోజువారీ జింక్‌ అవసరాలలో 4 శాతం తీరుస్తాయి. జింక్ ఒక ముఖ్యమైన పోషకం. ఇది రోగనిరోధక వ్యవస్థకు చాలా అవసరం. దీనితో పాటు జింక్ శరీర జీర్ణ, నాడీ వ్యవస్థలకు, కణాల పునరుత్పత్తి, విభజనకు, రుచి, వాసన వంటి లక్షణాలు సక్రమంగా నిర్వహించడానికి అవసరమైన పోషకం. కాబట్టి పుచ్చగింజలను ఇకపై పడేయకండి..

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Subscribe for notification
Verified by MonsterInsights