వేసవిలో చాలా మంది ఆరోగ్యకరమైన పానీయాలు, చల్లబరిచే పండ్లను తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. మండే ఎండల నుండి కొంత ఉపశమనం పొందడానికి, ముఖ్యంగా జ్యూస్ దుకాణాలలో, రోడ్డు పక్కన ఉన్న స్టాళ్ల నుండి పానీయాలు తాగడం, పండ్లు కొనడం సర్వసాధారణం.
సమ్మర్‌లో ముఖ్యంగా పిల్లల నుండి పెద్దల వరకు అందరూ పుచ్చకాయ తినడానికి ఇష్టపడతారు. మార్కెట్లో పుచ్చకాయ కొనేటప్పుడు, అది స్వచ్ఛమైనదో కాదో గుర్తించడం తప్పనిసరి. ఎందుకంటే మార్కెట్ లోకి కల్తీ పండ్లు వచ్చాయి. చూడటానికి ఎర్రగా ఉన్నాయని పండ్లను తినకండి. ముందు అవి స్వచ్ఛమైనవో కాదో గుర్తించాలి. లేదంటే ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే, కల్తీ పుచ్చకాయను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మీరు మొదట పుచ్చకాయ కొన్నప్పుడు విక్రేతను ఒక చిన్న ముక్కను కట్ చేసి మీకు ఇవ్వమని అడగండి. తరువాత, కట్ చేసిన పుచ్చకాయ ముక్క లోపలి భాగాన్ని టిష్యూ పేపర్ లేదా కాటన్ బాల్ తో సున్నితంగా రుద్దండి. టిష్యూ పేపర్ రుద్దినప్పుడు రంగు మారితే అది కల్తీ పుచ్చకాయ అని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చెబుతోంది. అది స్వచ్ఛమైన పుచ్చకాయ అయితే, దాని రంగు మారదు. ఈ సింపుల్ టిప్ ద్వారా కల్తీ పుచ్చకాయను ఈజీగా గుర్తించవచ్చని FSSAI అధికారులు తెలిపారు.
మరికొన్ని చిట్కాలు:
-
పుచ్చకాయలో అక్కడక్కడ కొద్దిగా తెలుపు, పసుపు ఉంటే, అది కల్తీ అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. పుచ్చకాయలను త్వరగా పండించడానికి కార్బైడ్ అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు. అందువల్ల, పుచ్చకాయ పైభాగంలో పసుపు రంగు కనిపిస్తే, తినడానికి ముందు ఉప్పు నీటిలో బాగా కడగడం మంచిది. పుచ్చకాయ కొనేటప్పుడు, మీరు దానిని జాగ్రత్తగా పరిశీలించాలి.
-
పుచ్చకాయలో రంధ్రాలు ఉంటే కొనకపోవడమే మంచిది, రుచిని జోడించడానికి సిరంజిలు వేసి ఉండవచ్చు.
-
అది కల్తీ పుచ్చకాయ అయితే, మీరు దానిని కోసినప్పుడు పండ్లలో ఎక్కువ పగుళ్లు ఉంటాయి. అందువల్ల, పుచ్చకాయ కొనేటప్పుడు, కొన్న తర్వాత ఈ దశలను పాటిస్తే, అది మంచిదా చెడ్డదా అని మీరు సులభంగా గుర్తించవచ్చని నిపుణులు అంటున్నారు.
Also Read:
కిడ్నీలో రాళ్లు ఉంటే.. పొరపాటున కూడా ఈ 4 ఆహారలు తినకండి..
మీకు స్వీట్లు అంటే ఇష్టమా.. ఇలా తింటే ఏ వ్యాధి బారిన పడరు..