Water Afte Syrup: సిరప్ పట్టించగానే పిల్లలకు నీరు తాగించవచ్చా… వైద్య నిపుణులు ఏమంటున్నారు

Written by RAJU

Published on:

పెద్దలు అనారోగ్యానికి గురైతే ఆస్పత్రికి వెళ్లి చెక్ చేయించుకుని అవసరమైతే ఇంజక్షన్స్, టాబ్లెట్స్ తీసుకు వచ్చి వాడతారు. అదే చిన్న పిల్లల విషయానికి వస్తే.. వారికి వచ్చే సాధారణ జలుబు, దగ్గు, జ్వరం ఇతరత్రా అనారోగ్య సమస్యల కోసం ఎక్కువగా సిరప్‌లే ఇస్తుంటారు వైద్యులు. అయితే చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు సిరప్ తాపాక.. వెంటనే నీళ్లు తాగిస్తుంటారు. కొందరు పెద్దలు కూడా ఇలానే చేస్తారు. మరి సిరప్ తాగిన వెంటనే ఇలా నీరు తాగించడం మంచిదేనా.. దీని గురించి నిపుణులు ఏమంటున్నారంటే..

పిల్లలకు సిరప్ పట్టించిన వెంటనే.. నీరు తాగించడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని.. పైగా ఇలా చేస్తే.. వారి గొంతులో అసౌకర్యం తగ్గి.. రుచి కూడా వెంటనే మారిపోతుంది అంటున్నారు వైద్య నిపుణులు. చిన్నారులకు వాడే సిరప్ తీయ్యగా, జిగటగా ఉండి.. తాగగానే గొంతులో కాస్త అసౌకర్యంగా ఉంటుంది. అలాంటప్పుడు సిరప్ తాగించగానే.. నీరు తాగిస్తే.. పైన పేర్కొన్న ఇబ్బందులు తొలగిపోతాయి అంటున్నారు.

అయితే ఇలా నీరు తాగించే ముందు కొన్ని విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోవాలి. సిరప్ పట్టించిన 2-3 నిమిషాల తర్వాత నీరు తాగించాలి. దాని పరిమాణం కూడ చాలా తక్కువగా అంటే 10-20 మి.లీ ఉండాలి అంటున్నారు వైద్యులు. సిరప్ పట్టించగానే.. ఎక్కువ నీళ్లు తాగిస్తే.. వాటి గాఢత తగ్గి.. నెమ్మదిగా శోషించే అవకాశం ఉంది అంటున్నారు వైద్యులు.

నీరు తాగించడం వల్ల నష్టమా

సాధారణ సిరప్‌ల విషయంలో అవి తాగగానే నీరు తాగితే పెద్దగా ప్రమాదం ఉండదు. కానీ కొన్ని ఔషధాలు తీసుకున్నప్పుడు (ఉదా: యాంటీబయాటిక్స్) నీటితో వెంటనే కలిస్తే వాటి ప్రభావం స్వల్పంగా తగ్గవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.

“సిరప్ రుచి వల్ల పిల్లలు నీళ్లు అడిగితే కొద్దిగా ఇవ్వవచ్చు. అది కూడా 5-10 నిమిషాలు ఆగి ఇస్తే ఇంకా మంచింది” అని వైద్యులు సూచిస్తున్నారు. సిరప్ తాపించిన తర్వాత.. పిల్లలకు కొద్దిగా నీరు ఇవ్వడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవు. కానీ నీరు ఇచ్చే సమయం, పరిమాణంలో జాగ్రత్త వహించాలి. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటున్నారు వైద్య నిపుణులు.

ఇవి కూడా చదవండి:

టీ లేదా కాఫీ తాగితే నిజంగా తలనొప్పి తగ్గిపోతుందా.. ప్రతిసారీ ఇదే అలవాటు కొనసాగిస్తే..

కిడ్నీ సమస్యలు ఉన్నవారు బెల్లం తింటే ఏమవుతుంది..

Subscribe for notification
Verified by MonsterInsights