Watch Video: రైల్వే ట్రాక్‌పై ఇరుక్కుపోయిన జవాన్ల కారు.. దూసుకువచ్చిన గూడ్స్ ట్రైన్.. చివరకు..!

Written by RAJU

Published on:

రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ సమీపంలోని లెవల్ క్రాసింగ్ వద్ద కేంద్ర భద్రతా దళానికి చెందిన వాహనాన్ని రైలు ఢీకొట్టింది. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్థానిక కథనాల ప్రకారం కారులో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కు చెందిన ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ఎలాంటి భద్రత లేని లెవల్ క్రాసింగ్‌ వద్ద సీఆర్‌పీఎఫ్ వాహనం దాటుతోంది. అయితే అదే సమయంలో వేగంగా వచ్చిన రైలు డీ కొట్టింది. కొంత దూరం వరకు కారు ఈడ్చుకుంటూ వెళ్లింది రైలు. ఈ ఘటనలో ఆర్మీ వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

రైళ్లు అక్కడికి చేరుకునే ముందు వాహనాలను ఆపడానికి లెవల్ క్రాసింగ్‌లో బూమ్ బారియర్లు లేవని ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపించింది. ప్రమాదానికి కొన్ని సెకన్ల ముందు, కారు క్రాసింగ్ వైపు మలుపు తిరుగుతున్నట్లు కనిపించింది. రైలు వస్తున్న విషయం డ్రైవర్‌కు తెలియదని నివేదికలు తెలిపాయి. వాహనం పట్టాల వద్దకు చేరుకున్నప్పుడు, ఒక CISF వ్యక్తి ముందు ఎడమ సీటు నుండి త్వరగా దిగి పరిగెత్తాడు. ఆ తర్వాత ఇద్దరు ప్రయాణీకులు బయటకు రాకముందే రైలు వాహనాన్ని ఢీకొట్టి, దానిని చాలా మీటర్లు ఈడ్చుకుంటూ వెళ్ళింది. శుక్రవారం(మార్చి 21) నాడు సాధారణ పెట్రోలింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు తెలిపారు. కాగా, గగుర్పాటుకు గురి చేస్తున్న వీడియోను మీరు చూసేయండి..

వీడియో.. 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Subscribe for notification