Watch Video: ట్రక్కును ఢీకొట్టిన రైలు.. రెండు ముక్కలైన లారీ.. గగుర్పాటుకు గురి చేస్తున్న దృశ్యాలు!

Written by RAJU

Published on:

మహారాష్ట్రలోని జల్గావ్‌లో ముంబై-అమరావతి ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. బోద్వాడ్ రైల్వే స్టేషన్‌లో అమరావతి ఎక్స్‌ప్రెస్ రైలును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రక్కు పూర్తిగా ధ్వంసమైంది. మూసివేసిన రైల్వే క్రాసింగ్‌ను ట్రక్కు దాటుతుండగా, అమరావతి ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. అత్యవసర బ్రేక్ వేయడంతో రైలు నిలిచిపోయి పెద్ద ప్రమాదం తప్పింది.

జల్గావ్‌లోని బోద్వాడ్ గుండా అమరావతి ఎక్స్‌ప్రెస్ రైలు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన ట్రక్కు రైలు ఇంజిన్‌ను ఢీకొట్టింది. అయితే, ట్రక్కు డ్రైవర్ తోపాటు ఇతర ప్రయాణీకులకు ఎటువంటి గాయాలు కాకపోవడం ఉపశమనం కలిగించే విషయం. ఈ ప్రమాదంలో ట్రక్కు పూర్తిగా ధ్వంసమైంది. ఆ ట్రక్కు ధాన్యం బస్తాలను తీసుకువెళ్తున్నట్లు సమాచారం. ఈ సంఘటనతో రైలు ఇంజిన్ ముందు భాగం కూడా తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో రైలు ముందు భాగంలో మంటలు చెలరేగాయని స్థానికులు చెబుతున్నారు. అయితే అది వెంటనే ఆరిపోయింది. ప్రమాదం తర్వాత ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం తర్వాత, రైల్వే ట్రాఫిక్ కూడా కొంతసేపు నిలిచిపోయింది. కొద్దిసేపటికే పరిస్థితి అదుపులోకి వచ్చి, ట్రాఫిక్ మళ్లీ సజావుగా ప్రారంభమైంది. ప్రమాదం జరిగిన సమయంలో రైలు వేగం తక్కువగా ఉండటంతో భారీ ప్రమాదం తప్పింది. స్లోగా వస్తున్న రైలును చూసిన ట్రక్ డ్రైవర్, రైల్వే ట్రాక్ దాటాలని అనుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. అయితే, ట్రక్కు అదుపుతప్పి నేరుగా రైలును ఢీకొట్టిందన్నారు.

ప్రమాదం జరిగినప్పుడు, ట్రక్కు డ్రైవర్ ట్రక్కు నుండి దూకి ప్రాణం కాపాడుకోగలిగాడు. తరువాత అతను ట్రక్కును అదే స్థితిలో వదిలి అక్కడి నుండి పారిపోయాడు. పోలీసులు ఇప్పుడు అతని కోసం వెతుకుతున్నారు. రైల్వే అధికారులు ట్రక్కులో దొరికిన పత్రాల ద్వారా యజమాని గురించి సమాచారం సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోందని సీనియర్ అధికారులు తెలిపారు.

వీడియో చూడండి.. 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Subscribe for notification