ఆకాశం నుంచి వందల మంది ప్యారా చుట్ సాయంతో కిందకు దూకేశారు. అటు ఇటు జోరుగా విమానాలు వస్తున్నాయి.. విమానాల నుంచి పారా ట్రూపర్స్ అలా గాలిలో నుంచి కిందకు దిగుతున్నారు. దాదాపు రెండు వందల ఎనభై మంది సైనికులు ఒకేసారి విమానాల నుంచి కిందకు దూకారు. ఈ హఠాత్తు పరిణామంతో స్థానికలుు యుద్ధం ఏమైనా జరుగుతుందా అనుకున్నారు. తర్వాత అసలు విషయం తెలుసుకుని ఉపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్-కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో జరిగింది.
పూర్తిగా సైనిక విన్యాసాల్లో భాగంగానే శిక్షణ పొందుతున్న ప్యారా ట్యూపర్స్ ఆకాశంలో విమానాలు నుంచి పారా చుట్ సాయంతో కిందకు దిగారు. ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులు ఈ దృశ్యాలు చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ప్రతి సంవత్సరం సైనిక విన్యాసాల్లో భాగంగా ఎవరైతే పారా ట్రూపర్స్ పారా జంపింగ్ శిక్షణ పొందుతున్న వారు ఉంటారో.. అనంతపురం – కర్ణాటక సరిహద్దులో ఈ సైనిక విన్యాసాల్లో పాల్గొంటారు.
ఈ క్రమంలోనే బళ్లారి వద్ద ఉన్న ఎయిర్ బేస్ నుండి విమానాలలో సైనికులు ఆకాశం నుండి పారా షూట్ సాయంతో అనంతపురం- కర్ణాటక సరిహద్దులో ఉన్న వందల ఎకరాల మైదాన భూముల్లో కిందకు దిగారు. వేసవికాలం.. పంటలు ఎవరూ వేయకపోవడం వల్ల వందల ఎకరాల మైదాన భూమి ఆంధ్ర- బళ్లారి సరిహద్దులో ఉండడంతో.. ఆర్మీ అధికారులు ప్రతి ఏడాది పారా ట్రూపర్స్ తో ఈ పారా జంపింగ్ శిక్షణా కార్యక్రమం చేపడతారు. సైనికులు ఆకాశంలో నుంచి విమానాల్లో కిందకు దూకుతూ పారా షూట్ సాయంతో ల్యాండ్ అయిన వెంటనే తిరిగి పారాషూట్లను తమ బ్యాగ్లలో మడతపెట్టి బేస్ క్యాంపునకు వెళ్లిపోతారు.
ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా గురువారం(మార్చి 27) మొత్తం 280 మంది సైనికులు ఈ పారా జంపింగ్ ట్రైనింగ్ లో పాల్గొన్నారు. ఇలా సైనికులందరూ విమానం నుంచి కిందకు దిగుతున్న దృశ్యాలను చుట్టుపక్కల గ్రామస్తులందరూ ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఆ దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో బంధించారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..