Watch: మద్యం మత్తులో తూలుతూ రోడ్డుపై పడిపోయిన రైఫిల్‌ ఉన్న పోలీస్…. తర్వాత ఏం జరిగిందంటే?

Written by RAJU

Published on:

ప్రజల్ని కాపాడాల్సిన ఖాకీలే తప్పుదోవ పడుతున్నారు. మద్యం మత్తులో తులూతూ ఓ పోలీసు కానిస్టేబుల్ నడి రోడ్డుపై పడిపోయిన సంఘటన అందరినీ షాక్ అయ్యేలా చేసింది. ఒక పోలీసు కానిస్టేబుల్ మద్యం మత్తులో రైఫిల్ పట్టుకుని రోడ్డుపై తూలుతూ కనిపించాడు. అది గమనించిన స్థానికులు, వాహనదారులు ఆ కానిస్టేబుల్‌ను పైకి లేపి పక్కన కూర్చోబెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. అయితే, ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌కు చెందినదిగా తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఒక పోలీస్‌ కానిస్టేబుల్‌ మద్యం మత్తులో రోడ్డుపై తూలిపడ్డాడు. రైఫిల్‌తో ఉన్న ఆ పోలీస్‌ను చూసి అక్కడున్న వారంతా ఆందోళనకు గురయ్యారు. కొందరు అతన్ని వీడియోలు తీశారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ఇవి కూడా చదవండి

వైరల్‌ వీడియోలో యూనిఫాం ధరించిన ఒక పోలీస్‌ వద్ద సర్వీస్‌ రైఫిల్‌ కూడా వెంట ఉండగా అతడు మద్యం మత్తులో తూలుతూ రద్దీగా ఉన్న రోడ్డుపై పడ్డాడు. పైకి లేచేందుకు కూడా ఇబ్బంది పడ్డాడు. ఆ పోలీస్‌ వద్ద రైఫిల్‌ ఉండటంతో ఆయనతోపాటు ఎవరికైనా ఏమైనా ప్రమాదం జరుగవచ్చని అక్కడున్న జనం భయాందోళన చెందారు. వెంటనే..అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ పోలీస్‌ స్పందించాడు. రైఫిల్‌ కలిగి మద్యం మత్తులో ఉన్న పోలీస్‌ కానిస్టేబుల్‌ని పైకిలేపి రోడ్డు పక్కకు తీసుకెళ్లాడు.

వీడియో ఇక్కడ చూడండి..

కాగా, ఈ వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో బిజ్నోర్ పోలీస్ శాఖ దీనిపై స్పందించింది. ఆ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ చర్యలు చేపట్టినట్లు ఎక్స్‌లో పేర్కొంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights