ఆ కాంప్లెక్స్ లో మొత్తం మూడు ఫ్లోర్ లు ఉండగా.. ప్రతి ఫ్లోర్ ను క్షుణ్నంగా తనిఖీ చేశారు. జడ్జీల ఛాంబర్లతో పాటు కోర్టు హాళ్లలో తనిఖీలు చేపట్టారు. ఇలా దాదాపు రెండు గంటల పాటు శ్రమించి, అక్కడ బాంబులేమీ లేవని, అది ఒక బెదిరింపు మెయిల్ మాత్రమేనని గుర్తించారు. ఈ మేరకు పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది తిరుగు ప్రయాణమయ్యారు.