పోలీసులకు ఫిర్యాదు..
ఆమె సదరు యువతిని కారులో వంగపహడ్ తీసుకుని వచ్చి.. శ్యాంరావ్ కావ్య ఇంట్లో పెట్టి వ్యభిచారం చేయాల్సిందిగా బలవంతం చేసింది. వారి నుంచి తప్పించుకున్న ఆ యువతి నేరుగా హసన్‌పర్తి స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి.. తగిన సాక్ష్యాధారాలను కోర్టు సమర్పించారు. వాదోపవాదాలు విన్న కోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితురాలు ముగ్దంగుల చందన, పాకనాటి శివమ్మ, పాకనాటి మమత, శ్యాంరావ్ కావ్య, డ్రైవర్ అన్వేష్‌ను దోషులుగా తేల్చింది. వారికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.6 వేల జరిమానా విధించింది.