
గంజాయి కట్టడికి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. స్మగ్లర్లు మాత్రం కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. అల్లూరి జిల్లాలో గంజాయి స్మగ్లర్లు హల్‌చల్ చేశారు. పోలీసులకు దొరక్కుండా తప్పించుకోవాలని చూశారు స్మగ్లర్లు. డుంబ్రిగుడ మండలం అరకు బైపాస్ రోడ్డులో.. గంజాయి లోడుతో వెళ్తుండగా కారు బోల్తా పడింది. ఇక కారు ప్రమాదానికి గురవడంతో స్మగ్లర్లు పారిపోయారు. స్థానికులు ఏదో యాక్సిడెంట్ జరిగిందని అక్కడి వెళ్లి చూడగా.. కారు అద్దాలు పగలగొట్టడంతో గంజాయి మూటలు కనిపించాయి. క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు పోలీసులు.