Vivek Venkataswamy : మాలల కంటే మాదిగ ఉద్యోగులే ఎక్కువ

Written by RAJU

Published on:


ABN
, Publish Date – Mar 19 , 2025 | 06:57 AM

ఉద్యోగుల్లో మాలల కంటే మాదిగలే ఎక్కువ ఉన్నారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి అన్నారు.

 Vivek Venkataswamy : మాలల కంటే మాదిగ ఉద్యోగులే ఎక్కువ

  • కులగణన మేరకు 18 శాతం రిజర్వేషన్లు.. బడ్జెట్‌లో నిధులను కేటాయించండి

  • కాంట్రాక్టు పనులు, నామినేటెడ్‌ పోస్టుల్లో.. మాలలకు ప్రాధాన్యమివ్వాలి: వివేక్‌

హైదరాబాద్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల్లో మాలల కంటే మాదిగలే ఎక్కువ ఉన్నారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి అన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై మాట్లాడారు. ప్రభుత్వం నుంచి లబ్ధిపొందిన వారిలో మాలలే అధికంగా ఉన్నారంటూ అసత్య ప్రచారం జరుగుతోందని వివరించారు. 2016-24 మధ్యకాలంలో గణాంకాలపై వాస్తవాలను సేకరించినట్లు తెలిపారు. ఈ గణాంకాల మేరకు మాదిగల్లో 66,522 మందికి.. మాలల్లో 48,388 మందికి ఉద్యోగాలు వచ్చినట్లు గుర్తుచేశారు. రెండు పడకల గదుల ఇళ్ల కేటాయింపుల్లోనూ 64,351 మంది మాదిగలు లబ్ధి పొందగా.. మాలల్లో ఆ సంఖ్య 41,439గా ఉందన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 10,776 మంది మాదిగలకు, 3,759 మంది మాలలకు లబ్ధి చేకూరిందన్నారు. కులగణన మేరకు ఎస్సీలకు 18% రిజర్వేషన్లు కల్పించాలని, బడ్జెట్‌లో కేటాయింపులను పెంచాలని విజ్ఞప్తి చేశారు. మాల కార్పొరేషన్లు, నేతగాని సొసైటీలకు నిధులను కేటాయించాలన్నారు. రూ.10 కోట్లలోపు విలువైన కాంట్రాక్టు పనుల్లో మాలలకు 18 నుంచి 20% అవకాశం కల్పించాలని, 15% నామినేటెడ్‌ పదవులు ఇవ్వాలని కోరారు. ఇదే అంశంపై మిగతా ప్రతినిధుల అభిప్రాయాలు ఈ కింది విధంగా ఉన్నాయి..

  • ఎస్సీ వర్గీకరణ చరిత్రలో నిలిచిపోయే అంశం అని.. ఇంతటితో సరిపెట్టకుండా.. ఎస్సీల జీవితాలను మెరుపరచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ కోరారు.

  • వర్గీకరణతోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభించదని, ప్రతి ఇంటికి పథకాలను వర్తింపజేయాలని సీపీఐ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు ప్రభుత్వానికి సూచించారు.

  • ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశానికే ఆదర్శమని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం కూడా సెంట్రల్‌ సర్వీసె్‌సలో ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

  • తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్‌.. సభలో వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టిన రోజు అసెంబ్లీకి హాజరుకాకపోవడం దారుణమని ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ విమర్శించారు.

  • ఉద్యమ సమయంలో కేసీఆర్‌ మాట ఇచ్చినట్లు.. 2014లోనే అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసి, పార్లమెంట్‌కు పంపారని జహీరాబాద్‌ ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు గుర్తుచేశారు.

  • దశాబ్దాల పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణ బిల్లును శాసనసభలో ఆమోదించినందుకు.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అన్ని రాజకీయ పార్టీల నేతలకు మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అఽధ్యక్షుడు కొంగరి శంకర్‌ ధన్యవాదాలు తెలిపారు.

Updated Date – Mar 19 , 2025 | 06:57 AM

Google News

Subscribe for notification