విశాఖపట్నం, ఏప్రిల్ 2: నగరంలోని మధురవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమోన్మాది తెగడబడ్డాడు. ప్రేమను నిరాకరించిందనే కోపంతో మధురవాడ స్వయంకృషి నగర్‌లో ఈరోజు (బుధవారం) మధ్యాహ్నం 12 గంటల సమయంలో యువతితో పాటు, ఆమె తల్లిపై ఓ వ్యక్తి కత్తితో అతి కిరాతకంగా దాడి చేసి పరారయ్యాడు. ఈ ఘటనలో తల్లి లక్ష్మి మృతిచెందారు. యువతి దివ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం గాయత్రి ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన యువకుడు నవీన్‌గా తెలుస్తోంది. బాధితురాలు డిగ్రీ చదువుకొని ఇంటి దగ్గర ఖాళీగా ఉందని సమాచారం. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని లక్ష్మి మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రేమ పేరుతో యువతిని నవీన్ అనే వ్యక్తి కొంత కాలంగా వేధింపులకు గురిచేశాడు. అయితే ప్రేమను నిరాకరించడంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించాడు. వెంటనే యువతి ఇంటికి వెళ్లిన యువకుడు కత్తితో యువతితో పాటు ఆమె తల్లిపైనా దాడికి తెగబడ్డాడు. తీవ్రంగా గాయపడిన తల్లి లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా.. యువతి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం యువతి.. గాయత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 48 గంటలు గడిస్తే గాని ఆమె పరిస్థితి ఎలా ఉంది అనేది చెప్పలేమని వైద్యులు చెప్పారు. అయితే ఈ ఘటనలో యువతి కూడా మరణించినట్లు వార్తలు రావడంతో దీనిపై ఏసీపీ అప్పలరాజు మాట్లాడుతూ.. యువతికి చికిత్స జరుగుతోందని చెప్పారు. అలాగే విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి వెళ్లగా.. అప్పటికే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చీ, డీసీపీ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అయితే తల్లీకూతుళ్లపై ప్రేమోన్మాది దాడితో స్వయంకృషి నగర్‌లో ఒక్కసారిగా అలజడి నెలకొంది.
హోంమంత్రి స్పందన
మరోవైపు మధురవాడ ప్రేమోన్మాది ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) స్పందించారు. విశాఖ నగర పోలీస్ కమీషనర్ శంకబ్రత బాగ్చీతో ఫోన్‌లో మాట్లాడారు హోంమంత్రి. బాధితురాలు దివ్య ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. దివ్యకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రేమోన్మాదిని త్వరగా గాలించి పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దివ్య తల్లి లక్ష్మి మృతిపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
CM Chandrababu On Tirumala: తిరుమలలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్ష
AP Police Search For Kakani: హైదరాబాద్‌లోని కాకాణి నివాసానికి ఏపీ పోలీసులు..
Read Latest AP News And Telugu News
Updated Date – Apr 02 , 2025 | 04:45 PM