
క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ సాధించిన విజయాలు, రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం కోహ్లీ కోసమే క్రికెట్ మ్యాచ్ లు చూసే వారు చాలామంది ఉన్నారు. కేవలం ఆటతోనే కాదు తన ప్రవర్తన, క్రమ శిక్షణ తోనూ ప్రపంచ వ్యాప్తంగా అందరి మన్ననలు అందుకున్నాడు కోహ్లీ. ఇక విరాట్ కోహ్లీ పర్సనల్ లైఫ్ లోనూ ఎన్నో ఆసక్తికర మలుపులున్నాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులు
విరాట్ కోహ్లీ బయోపిక్ వస్తే చూడాలని కోరుకుంటున్నారు. గతంలో దీనికి సంబంధించి పలు ఊహాగానాలు వినిపించాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కోహ్లీ బయోపిక్ లో నటిస్తాడని ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పుడు మరో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. కోలీవుడ్ నటుడు శింబు విరాట్ కోహ్లీ బయోపిక్‌లో నటిస్తాడని నెట్టింట రూమర్లు, పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఇలా కోహ్లీ బయోపిక్ లో ఉన్నట్లుండి శింబు పేరు రావడానికి ఒక కారణముంది. విరాట్ కోహ్లీ ఇటీవల RCB చాట్ షోలో తనకు ఇష్టమైన పాట గురించి మాట్లాడాడు. తాను ప్రస్తుతం ఏ పాటను పదే పదే వింటున్నానో వెల్లడించాడు. కోహ్లీ తమిళ సినిమా ‘పట్టు తల’ లోని ‘నీ సింగం ధన్..’ పాటను రిపీట్ మోడ్‌లో వింటున్నాడట. ఇది శింబు నటించిన సినిమాలోని పాట. ‘నీ సింగం ధన్’ అంటే ‘నువ్వు నిజంగా సింహంవి’. ఈ పాట గురించి విరాట్ కోహ్లీ మాట్లాడుతున్న వీడియోను శింబు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. “విరాట్ కోహ్లీ నువ్వు నిజంగా సింహం” అని అతను దానికి క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో అందరూ కోహ్లీ బయోపిక్ గురించి మాట్లాడుకోవడం ప్రారంభించారు.
మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు, విమానాశ్రయంలో వేచి చూస్తున్నప్పుడు విరాట్ కోహ్లీ ఈ పాటను పదే పదే వింటాడట. అందువల్ల, శింబు తన బయోపిక్‌లో నటించడానికి తగినవాడని అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ, శింబు మధ్య చాలా పోలికలు ఉన్నాయని కూడా అంటున్నారు.
కోహ్లీ నోట శింబు మాట..
View this post on Instagram
కోలీవుడ్‌లో శింబు తనదైన ముద్ర వేశాడు. అతను చాలా సంవత్సరాలుగా సినిమా పరిశ్రమలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. రొమాంటిక్ హీరోగా, లవర్ బాయ్ గా, యాక్షన్ హీరోగా బోలెడంత మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే
విరాట్ కోహ్లీ బయోపిక్‌లో శింబు నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి దీనిపై శింబు ఎలా స్పందిస్తాడో చూడాలి.
ప్రస్తుతం అందరూ శింబు నటించిన ‘థగ్ లైఫ్’ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు.
శింబు లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి