Viral video: స్కామర్‌కు చుక్కలు చూపించిన అమ్మాయి.. నన్నే మోసం చేస్తావా అని.. ఏం చేసిందంటే!

Written by RAJU

Published on:

పెరుగుతున్న టెక్నాలజీతో కొందరు అద్భుతాలు సృష్టిస్తుంటే కొందరు కేటుగాళ్లు ఆ టెక్నాలజీని వాడుకొని మోసాలకు పాల్పడుతున్నారు. యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాక దేశంలో సైబర్‌ మోసాలు పెరిగి పోయాయి. ప్రజల నుంచి డబ్బులు కాజేయడానికి ఈ కేటుగాళ్లు కొత్త వ్యూహాలను ఎంచుకుంటున్నారు. ప్రజలకు ఫోన్ చేసి పోలీస్ అధికారులమని, బ్యాంక్ అధికారులమని, ప్రభుత్వ అధికారుల మని చెప్పి వాళ్ల బ్యాంక్‌ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఈ తరహా ఓ కొత్త మోసం ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. మీ తండ్రి ఫ్రెండ్‌ను అని, లేదా అన్నయ్య ఫ్రెండ్‌నని..తమ కుటుంబం ఇబ్బందుల్లో ఉందని ఆర్థిక సాయం అవసరమని చెప్పి మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఇలా ఒక అమ్మాయిని మోసం చేసేందుకు ప్రయత్నించిన ఓ స్కామర్‌కు.. ఆ అమ్మాయి చక్కని గుణపాఠం చెప్పింది. తన తెలివితేటలతో అతను చేసిన స్కామ్‌ను అతనికే తిప్పి కొట్టిండి. ఆ అమ్మాయి తెలివికి మెచ్చుకొని చివరికి ఆ స్కామరే ఒటమిని గ్రహించాడు. అసలు ఇక్కడే ఏం జరిగిందో చూద్దాం పదండి..

ఒకసారి ఈ ఎక్స్‌ పోస్ట్‌ చూడండి…

X లో పోస్ట్‌ చేసిన ఈ వీడియో ప్రకారం ఓ అమ్మాయికి ఓ స్కామర్‌ ఫోన్ చేస్తాడు. నేను మీ తండ్రి స్నేహితుడినని.. ఆమె తండ్రికి డబ్బులు ఇవ్వాల్సి ఉందని ..వాటిని మా కూతురికి ఇవ్వు అని ఆమె తండ్రి తనతో చెప్పినట్టు ఆ స్కామర్ చెప్పాడు. అప్పుడు ఆ అమ్మాయి..నాకు ఇవ్వమన్నాడ? అలా మా నాన్న నాకు ఏం చేప్పలేదే అంది. మీ నాన్న బిజీగా ఉన్నాడట అందుకే నీకు ఇవ్వమన్నాడని ఆ స్కామర్ చెప్తాడు..సరే అని ఆ అమ్మాయి చెప్పడంతో ఆమె నెంబర్‌ రూ.20,000 వేసినట్టు టెక్ట్స్‌ మెసేజ్ పంపుతాడు. డబ్బులు వచ్చాయా అని అమ్మాయిని అడుగుతాడు. అమ్మాయి వచ్చాయని చెప్పడంతో.. అయ్యే  మీ నాన్నకు ఇవ్వాల్సింది రూ.2,000 నమ్మా..పొరపాటున రూ.20,000 పంపానని చెప్తాడు. మిగతా రూ.18,000 రిటర్న్‌ కొట్టాలని అడుగుతాడు. అయితే బ్యాంక్‌ నుంచి మెసేజ్‌ రాకుండా..నార్మల్‌ టెక్స్ట్‌ మెసేజ్‌ రావడంతో ఇది స్కామ్‌ అని ఆ యువతి పసిగడుతుంది. తన టాలెంట్‌ను ఉపయోగించి ఆ స్కామర్‌కు దిమ్మతిరిగే షాక్ ఇస్తుంది. ఒకే అంకుల్‌ పంపుతానని చెప్పి ఆ స్కామర్ పంపిన మెసేజ్‌నే ఎడిట్‌ చేసి.. రూ.18,000 పంపినట్టు ఆ అమ్మాయి కూడా అతనికి టెక్స్ట్‌ మెసేజ్‌ చేస్తుంది. డబ్బులు వచ్చాయా అంకుల్ అని అడుగుతుంది. ఆ మెసేజ్‌ చూసి దొరికిపోయానని గ్రహించిన స్కామర్‌.. ఆ అమ్మాయి తెలివికి షాక్‌ అయి ఒటమిని అంగీకరించి కాల్‌ కట్‌ చేస్తాడు. ఈ తంతంగాన్నంత వీడియో తీసిన ఆ యువతి ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన అందరూ ఆ అమ్మాయి ట్యాలెంట్‌కు హ్యాట్సాప్ చేస్తున్నారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights