అప్పటి వరకు వారి ప్రయాణం సాఫిగా సాగుతోంది. ఉన్నట్టుండి బస్సుకు బ్రేక్‌లు పడ్డాయి. ప్రాణాలతో తాము బయటపడుతామా..? అంటూ ఆ బస్సులో ఉన్న వారంతా హడలిపోయారు. కొన్ని నిమిషాల పాటు వారికి చెమటలు పట్టాయి.. ఏం జరుగుతుందోనని.. అంతటా నిశ్శబ్దం.. చివరకు ఏం జరిగిందో తెలియాలంటే ఈ వార్తను చదవాల్సిందే.. అసలు ఏం జరిగిందంటే.. అటుగా వాహనాల్లో వెళ్తున్న వారికి ఓ ఏనుగు అడ్డుపడింది. అకస్మాత్తుగా వచ్చిన గజరాజు.. బస్సుకు ఎదురుంగా తిష్టవేసింది. బస్సుకు దగ్గరగా వచ్చి కాసేపు అలా నిల్చుండిపోయింది.. భారీ గజరాజును చూసి.. అక్కడున్న వారంతా ఏం జరుగుతుందోనని.. టెన్షన్ పడ్డారు. చివరకు గజరాజు ఎలాంటి హాని తలపెట్టకుండా వెళ్లడంతో అక్కడున్న వారంతా ఊపిరిపీల్చుకున్నారు.
భారీ ఏనుగు హల్‌చల్ చేసిన ఘటన తమిళనాడు తిరుపత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. కావలూరు అటవీ ప్రాంతంలో రోడ్డుపై తిష్ట వేసింది.. బస్సును ఏనుగు వెంబడించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు ఏనుగు నుంచి రక్షణ కల్పించారు.. కాసేపు ప్రయాణికులు హడలిపోయారు .. ఏనుగు ఎలాంటి దాడి చేస్తోందని ఆందోళనకు గురయ్యారు.. అయితే చివరికి ఏనుగు అక్కడి నుంచి వెళ్లడంతో వారంతా క్షేమంగా బయటపడ్డారు.
వీడియో చూడండి..
దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.. ఏనుగు బస్సు దగ్గరకు వచ్చి కాసేపు నిల్చుంది.. దీంతో ప్రయాణికులు భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..