Viral Video: ఓవర్‌ స్పీడ్‌తో లారీ కిందికి దూసుకెళ్లిన బైక్‌… సీసీ కెమెరాలో వీడియో రికార్డ్‌ – Telugu Information | viral video Three youths severely injured after bike collides with oncoming lorry in Jangaon, recorded on CCTV digital camera

Written by RAJU

Published on:

స్పీడ్‌ త్రిల్స్‌.. బట్‌ కిల్స్‌ అని పోలీసులు అడుగడుగునా హెచ్చరికల బోర్టులు పెట్టినా ఆ యువకులు చెవిమీద పేను పారనట్లుగా ప్రవర్తించారు. ఫలితంగా ప్రాణాపాయంతో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన జనగాం జిల్లాలో జరిగింది. జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని జనగామ మండలం పెద్దపహాడ్ స్టేజి వద్ద ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది.

జనగామ నుండి సిద్దిపేట వైపు వెళ్తున్న లారీని ఎదురుగా వెళ్లి ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో లారీ టైర్ కిందికి ముగ్గురు యువకులు దూసుకెళ్లారు. దీంతో ఆ యువకులు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని స్థానికులు జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటన స్థానికంగా సీసీ ఫుటేజ్ లో రికార్డ్ కావడంతో స్థానికంగా వైరల్‌గా మారింది. సీసీ వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వీడియో చూడండి:

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights