Viral Video: ఐపీఎల్ టీమ్‌లలోకి మోదీ, రాహుల్‌, అమిత్ షా, మ‌మ‌త‌ రచ్చరచ్చ… ఏఐ వీడియోకు నెటిజన్స్‌ ఫిదా

Written by RAJU

Published on:


Viral Video: ఐపీఎల్ టీమ్‌లలోకి మోదీ, రాహుల్‌, అమిత్ షా, మ‌మ‌త‌ రచ్చరచ్చ… ఏఐ వీడియోకు నెటిజన్స్‌ ఫిదా

దేశ‌వ్యాప్తంగా ఐపీఎల్ ఫీవ‌ర్ న‌డుస్తోంది. తమ అభిమాన జట్ల ఫర్‌ఫార్మెన్స్‌ చూస్తూ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు ఫ్యాన్స్‌. వీకెండ్‌ల‌లో డ‌బుల్ హెడ‌ర్‌ల‌ను ఫ్యాన్స్ మ‌రింత ఎంజాయ్ చేస్తున్నారు. మార్చి 22 న ప్రారంభ‌మైన ఐపీఎల్ 18వ సీజ‌న్ మే 25 వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఈ క్రమంలో తాజాగా కృత్రిమ మేధ సాయంతో ఐపీఎల్ నేప‌థ్యంలో రూపొందించిన‌ వీడియో ఒక‌టి సోషల్‌ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వీడియోలో ఇండియాలోని టాప్ పొలిటిషియ‌న్స్ వివిధ ఐపీఎల్ టీమ్‌ల జెర్సీలు ధ‌రించి ఐపీఎల్‌ బరిలోకి దిగడం ఆకట్టుకుంటోంది.

ఈ వీడియోలో.. ప్రధాని మోదీ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు తరపున బరిలోకి దిగితే, ప్రతిప‌క్షనేత రాహుల్ గాంధీ పంజాబ్ కింగ్స్‌ జెర్సీతో సై అంటూ దిగారు, సోనియా గాంధీ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తరపున, మంత్రులు అమిత్ షా .. చెన్నై సూప‌ర్ కింగ్స్‌, రాజ్‌నాథ్ సింగ్ గుజ‌రాత్ టైటాన్స్, నిర్మలా సీతారామన్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, జైశంక‌ర్..ఎస్ఆర్‌హెచ్‌, మ‌మ‌త బెన‌ర్జీ కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్, ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్..ఢిల్లీ క్యాపిట‌ల్స్, దేవేంద్ర ఫ‌డ్నవీస్ ముంబ‌యి ఇండియ‌న్స్‌ జెర్సీలతో మైదానంలో దిగినట్టు వీడియోలో చూపించారు.

ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో అభిమానులు త‌మ‌దైనశైలిలో స్పందిస్తున్నారు. ఐపీఎల్ జెర్సీలు నేత‌ల‌కు క‌రెక్ట్‌గా స‌రిపోయాయ‌ని కామెంట్లు చేస్తున్నారు.

వీడియో చూడండి:

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights