Viral video: అందుకే స్పీడ్‌ తగ్గించుకోమనేది..ఓవర్‌టేక్‌ చేయబోయి పల్టీలు కొట్టిన ట్యాంకర్!

Written by RAJU

Published on:

ఇటీవల రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా రోజూ ఎక్కడో అక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. హైవేలపై హెవీ స్పీడ్‌తో వాహనాలు నడుపుతూ.. ఓవర్‌ టేక్ చేసే క్రమంలో కంట్రోల్‌ చేయలేక డివైడర్లను ఢీకొట్టి, లేదా అదుపుతప్పి రోడ్డుపై పల్టీలు కొట్టే ఘటనలు మనం చాలానే చూసుంటాం. ఇలాంటి షాకింగ్‌ ఘటనే బెంగళూరులో చోటు చేసుకుంది. ఓ వాటర్‌ ట్యాంకర్‌ అదుపుతప్పి రోడ్డుపై పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ఈ వీడియో చూడండి…

బెంగళూరు శివారులోని దొమ్మసంద్రం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. దొమ్మసంద్రం నుంచి వర్తూర్‌ వైపు ఓ వాటర్ ట్యాంకర్‌ వేగంగా వెళ్తోంది. ఈ క్రమంలో ఆ ట్యాంకర్‌ డ్రైవర్‌ ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టెక్‌ చేయడానికి ప్రయత్నించాడు. వేగం ఎక్కువగా ఉండడంతో వాహనాన్ని కంట్రోల్ చేయలేకపోయాడు. దీంతో అదుపుతప్పి వాహనం రోడ్డుపై పల్టీలు కొట్టింది. ప్రమాదంలో ట్యాంకర్‌ డ్రైవర్‌, క్లీనర్‌కు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే వారిని హాస్పిటల్‌కు తరలించారు. ట్యాంకర్‌ రోడ్డుకు అడ్డంగా పడడంతో ఘటనా స్థలంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్థానికుల సమచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు రోడ్డుపై నుంచి ట్యాంకర్‌ను తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights