Viral Information: అఘోరీతో బీటెక్‌ యువతి జంప్‌… మరో లేడీ అఘోరీగా మారబోతుందా? – Telugu Information | Btech pupil dad and mom criticism on girl aghori in mangalagiri police station

Written by RAJU

Published on:

తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీ గురించి తెలియని వారు ఉండరు. ఆ మధ్య ఆమె వరుసగా ఆలయాలకు వెళ్లి అక్కడ నానా హంగామా చేసింది. అయితే కొద్దిరోజులుగా ఆమె పెద్దగా కనిపించడం లేదు. అయితే తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరిలో బిటెక్ చదువుతున్న విద్యార్థిని అఘోరీగా మారటానికి ఇంటిలో నుంచి వెళ్ళిపోవడం కలకలం రేపుతోంది. ప్రియదర్శిని కాలేజ్ లో బిటెక్ చదివిన విద్యార్థినికి కొన్ని రోజుల క్రితం మంగళగిరికి వచ్చిన లేడీ అఘోరీతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొద్దీ రోజుల పాటు విద్యార్థిని ఇంట్లోనే అఘోరీ బస చేసింది. ఆ క్రమంలో అఘోరికీ, యువతికి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.

రెండు రోజుల క్రితం మేజర్ అయిన యువతి తాను అఘోరీగా మారటానికి హైదరాబాద్ వెలుతున్నట్లు పోలీసులకు చెప్పి వెళ్ళింది. తాను మేజర్‌ను అని, అయితే తన తల్లిదండ్రులకు తాను అఘోరీగా మారటం ఇష్టం లేదని దీంతో ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నట్లు చెప్పింది.

సోమవారం యువతి తండ్రి కోటయ్య పోలీసులను ఆశ్రయించాడు. తన కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అంతకుముందే ఆ యువతి పోలీసులకు తాను వెళ్ళిపోతున్నట్లు చెప్పడంతో అదే విషయాన్ని పోలీసులు తల్లిదండ్రులుకు చెప్పారు. దీంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తమ కూతూరిని ఆఘోరి వశపరుచుకుందని ఆరోపించారు. అఘోరి చెర నుంచి తమ కూతురును విడిపించి తమకు అప్పగించాలని వేడుకుంటున్నారు

అఘోరీ తమ కూతురిని కిడ్నాప్ చేసిందని పేరెంట్స్‌ ఆరోపించారు. గత కొన్ని రోజులుగా శ్రీ వర్షిణి అఘోరీతోనే ఉంటోందని.. తన కూతురికి మత్తు మందు ఇచ్చి అఘోరీ తన వశం చేసుకుందని తండ్రి కోటయ్య ఆరోపిస్తున్నారు. లేడీ అఘోరీ తమ కూతురిని కిడ్నాప్ చేసిందని.. తమ మాట వినడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Subscribe for notification