Viral: అల్లుడితో వెళ్లిపోయిన అత్త.. తిరిగొచ్చేసింది కానీ అసలు ట్విస్ట్ ఇదే..

Written by RAJU

Published on:


Viral: అల్లుడితో వెళ్లిపోయిన అత్త.. తిరిగొచ్చేసింది కానీ అసలు ట్విస్ట్ ఇదే..

పోలీసు స్టేషన్‌లో లొంగిపోయిన సప్న ఈ క్రమంలో తాను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో పోలీసులకు వివరించింది. తన భర్త జితేంద్ర కుమార్ పెద్ద తాగుబోతు అని, తరుచూ తాగొచ్చి తనను కొట్టేవాడని.. తన కూతురు కూడా తరచూ తనతో గొడవలు పెట్టుకునేదని.. అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపింది. తాను ఇంటి నుంచి వెళ్లేటప్పుడు డబ్బు, నగలు తీసుకెళ్లలేదని, తన దగ్గర కేవలం ఓ మొబైల్ ఫోన్, రూ.200 మాత్రమే ఉన్నట్లు తెలిపింది. మరోవైపు.. తనను సప్న బెదిరించడంతోనే ఆమెతో పారిపోడానికి ఒప్పుకున్నట్లు రాహుల్ కుమార్ చెప్పాడు. అలీఘర్ బస్ స్టాప్‌లో కలవకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని సప్న తనకు ఫోన్ చేసి చెప్పిందని.. దీంతో తాను అక్కడికి వెళ్లానని.. ఆ తర్వాత ఇద్దరూ కలిసి లక్నో వెళ్లినట్టు తెలిపాడు. పోలీసులు తమ కోసం గాలిస్తున్నారు అని తెలియడంతో తామే వచ్చి లొంగిపోయినట్లు చెప్పాడు. అయితే ఇప్పుడు సప్నని పెళ్లి చేసుకుంటావా అని అడినప్పుడు.. తాను సిద్దంగానే ఉన్నట్టు తెలిపాడు.

అలీఘర్‌లోని దాదోన్‌కు చెందిన సప్న, జితేంద్ర కుమార్ భార్యాభర్తలు. వీరికి శివానీ అనే ఓ కూతురు ఉంది. ఆమెకు పెళ్లి చేయాలని భావించిన తల్లిదండ్రులు రాహుల్ కుమార్ అనే యువకుడితో శివానీకి పెళ్లి నిశ్చియించారు. మరో 10 రోజుల్లో పెళ్లి ఉంది అనగా ఏప్రిల్ 6, 2025న 40 ఏళ్ల స్వప్న.. తనకు కాబోయే అల్లుడు రాహుల్ కుమార్‌తో పరారీ అయ్యింది. దీంతో, ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

 

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights