Vinod Kambli: వినోద్ కాంబ్లీకి సునీల్ గవాస్కర్ అండగా నిలిచారు. ఈ సహాయాన్ని గవాస్కర్ CHAMPS ఫౌండేషన్ అందిస్తుంది. ఈ సహాయం కింద, కాంబ్లీకి జీవితాంతం ప్రతి నెలా రూ. 30,000 ఇవ్వనున్నారు. దీంతో పాటు, అతనికి ఏడాది పొడవునా వైద్య ఖర్చుల కింద విడిగా రూ. 30,000 కూడా లభిస్తుంది. అవసరమైన అంతర్జాతీయ క్రికెటర్లకు సహాయం చేసే లక్ష్యంతో సునీల్ గవాస్కర్ CHAMPS ఫౌండేషన్ 1999లో ప్రారంభించారు.
ప్రతి నెలా కాంబ్లీకి ఎంత డబ్బు ఇవ్వనున్నారంటే?
నివేదికల ప్రకారం, ఫౌండేషన్ ద్వారా వినోద్ కాంబ్లీకి నెలకు 30000 రూపాయలు ఇవ్వనున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఇది అమలులోకి వచ్చింది. 53 ఏళ్ల కాంబ్లీ జీవించి ఉన్నంత కాలం ఈ డబ్బును అందుకుంటూనే ఉంటాడు. ఇది కాకుండా వార్షిక వైద్య ఖర్చులు రూ. 30,000 విడిగా చెల్లించనున్నారు.
జనవరిలో సమావేశం, ఏప్రిల్‌లో సహాయం..
జనవరి 11న వాంఖడే స్టేడియం 50వ వార్షికోత్సవం సందర్భంగా సునీల్ గవాస్కర్ వినోద్ కాంబ్లీని కలిశారు. ఆ సమయంలో, గవాస్కర్ పాదాలను తాకుతూ కాంబ్లి భావోద్వేగానికి గురయ్యాడు. ఆ సమావేశం తర్వాత, సునీల్ గవాస్కర్ ఫౌండేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.
గత ఏడాది డిసెంబర్‌లో వినోద్ కాంబ్లీ ఆరోగ్యం గణనీయంగా క్షీణించింది. అతనికి మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ తర్వాత అతన్ని ఆసుపత్రిలో చేర్చారు. దీంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ క్రమంలో గవాస్కర్ ఫౌండేషన్ కాంబ్లీకి తోడుగా నిలిచింది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..