ABN
, Publish Date – Apr 17 , 2025 | 05:16 AM
వికారాబాద్ జిల్లా ధారూరు మండల పరిధిలోని మున్నూర్ సోమారంలోని 20 ఏళ్ల నాటి పాఠశాల భవనంలోని ఓ తరగతి గదిలో బుధ వారం పైకప్పు పెచ్చులు ఊడి పడడంతో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి.

ధారూరు, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్ జిల్లా ధారూరు మండల పరిధిలోని మున్నూర్ సోమారంలోని 20 ఏళ్ల నాటి పాఠశాల భవనంలోని ఓ తరగతి గదిలో బుధ వారం పైకప్పు పెచ్చులు ఊడి పడడంతో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. శిరీష(6) స్థానిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. బుధవారం పాఠశాలకు వెళ్లగా.. తరగతి గది పైకప్పు పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడ్డాయి. దీంతో శిరీష తల, చెవి, చెయ్యి, కాలుకు గాయాలయ్యాయి.
ఆ సమయంలో తరగతి గదిలో 9 మంది విద్యార్థులుండగా.. శిరీష మినహా మిగిలిన వారంతా ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇక, శిరీషను వికారాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. మధ్యాహ్నం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. కాగా, ప్రమాదం సంగతి తెలుసుకున్న జిల్లా విద్యా శాఖ అధికారి(డీఈవో) రేణుకాదేవి ఆస్పత్రికి వెళ్లి బాధిత బాలికను పరామర్శించారు.
Updated Date – Apr 17 , 2025 | 05:16 AM