Vijayasai Reddy : ‘రాజు జనంలోకి రావాలి..! లేదంటే కోటరీ వదలదు, కోట కూడా మిగలదు’ – విజయసాయిరెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్

Written by RAJU

Published on:

“పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు. కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేది. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా ఆ కోటరీ ఏం చేసేదంటే, ఆహా రాజా! ఓహో రాజా అంటూ పొగడ్తలతో రాజు కళ్ళకు గంతలు కట్టి, తమ ఆటలు సాగించుకునేది. దీనితో రాజూ పోయేవాడు, రాజ్యం కూడా పోయేది. కోటరీ కుట్రల్ని గమనించిన మహా రాజు… తెలివైన వాడు అయితే మారు వేషంలో ప్రజల్లోకి వచ్చి, ఏం జరుగుతోందో తనకు తానుగా తెలుసుకునేవాడు. వారిమీద వేటు వేసి, రాజ్యాన్ని కాపాడుకునేవాడు. కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి! ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలను అర్థంచేసుకోవాలి. లేదంటే కోటరీ వదలదు, కోట కూడా మిగలదు! ప్రజాస్వామ్యంలో అయినా జరిగేది ఇదే!” అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ (X ఖాతా)లో పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ వైసీపీనే ఉద్దేశించి చేశారా..? అన్న చర్చ జోరుగా జరుగుతోంది.

Subscribe for notification