Vijay Criticizes CM Stalin and PM Modi Over Governance and Delimitation Points

Written by RAJU

Published on:

  • తమిళనాడులో దుర్మార్గపు పాలన
  • సీఎం స్టాలిన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన విజయ్
  • ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ విజయ్ విమర్శలు
Vijay Criticizes CM Stalin and PM Modi Over Governance and Delimitation Points

జాతీయ విద్యావిధానంలోని త్రిభాషా సూత్రం, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై కేంద్రం, కొన్ని రాష్ర్ట ప్రభుత్వాల మధ్య వివాదం సాగుతున్న విషయం విదితమే. తాజాగా వీటిని వ్యాతిరేకిస్తూ.. తమిళగ వెట్రి కళగం పార్టీ తీర్మానాలు చేసింది. శుక్రవారం తిరువన్మయూర్‌లో వియజ్ ఆధ్వర్యంలో తొలి జనరల్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో వక్ఫ్‌ సవరణ బిల్లుతో సహా మొత్తం 17 తీర్మానాలను ఆ పార్టీ ఆమోదించింది. ఈ సమావేశానికి హాజరైన విజయ్ ప్రసంగించారు.

READ MORE: IPL 2025: ఆర్‌సీబీ ఆటగాళ్లకు డీకే ఆతిథ్యం.. గ్రాండ్‌గా పార్టీ, వీడియో వైరల్!

సీఎం స్టాలిన్ టార్గెట్ గా విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కక్ష్య సాధింపు రాజకీయం చేస్తోందని చెబుతున్న స్టాలిన్ చేస్తోంది కూడా అదే అన్నారు. “తమిళనాడులో దుర్మార్గపు పాలన జరుగుతోంది. ముత్తువేలు కరుణానిధి స్టాలిన్ ఎమ్‌కే స్టాలిన్ అని పేరు పెట్టుకుంటే సరిపోదు. పేరు గొప్పగా ఉంటే గౌరవం రాదు.. చేసే పనుల వల్ల గౌరవం వస్తుంది.. స్టాలిన్ ఈ విషయం గుర్తుంచుకోవాలి.. మా పార్టీ సమావేశాలకు వేదికలు కూడా లేకుండా చేస్తున్నారు.. నన్ను ఆపడానికి నువ్వెవరు.. ప్రభుత్వ పాలన అంటే రాష్ట్రమంతా బాగుండాలి.” అని విజయ్ వ్యాఖ్యానించారు.

READ MORE: Devadula Pipeline Leak: దేవాదుల ప్రాజెక్ట్ పైప్‌లైన్ లీక్.. మండిపడిన రైతులు

స్టాలిన్ కుటుంబం ఒక్కటే బాగుంటే కాదు.. ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ విజయ్ విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ మీరు తమిళనాడును తేలిగ్గా తీసుకోకండన్నారు.. తమిళనాడు చాలా రాష్ట్రాలకు చుక్కలు చూపించిన చరిత్ర ఉందని స్పష్టం చేశారు. తమిళనాడును సాఫ్ట గా హ్యాండిల్ చేయండని.. డీ లిమిటేషన్ పేరుతో మీ కుట్రలు ఏంటో తెలుస్తోందన్నారు.. ఒకే దేశం ఒకే ఎన్నికలు అన్న ఆలోచనతో తమిళనాడుకు అన్యాయం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.. మోడీ పేరు చెప్పడానికి భయపడుతున్నారని అంటున్నారు.. నాకేం భయం లేదని స్పష్టం చేశారు.

Subscribe for notification
Verified by MonsterInsights