Video: 6 ఫోర్లు, 4 సిక్సులతో ఊచకోత.. 25 బంతుల్లోనే ఆర్‌సీబీకి మెంటలెక్కించిన రహానే

Written by RAJU

Published on:


రహానే సిక్స్‌తో తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సుయాష్ వేసిన ఓవర్ చివరి బంతి ఫీల్డ్ అంపైర్‌కు తాకకుండా తృటిలో తప్పించుకున్నాడు.

11 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా 3 వికెట్లు నష్టపోయి 110 పరుగులు చేసింది. సునీల్ నరైన్, అజింక్య రహానే మధ్య యాభై పరుగుల భాగస్వామ్యం నెలకొంది. రహానే 25 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

8వ ఓవర్లో సునీల్ నరైన్ కి లైఫ్ వచ్చింది. రసిఖ్ సలాం ఓవర్లో అతని బ్యాట్ స్టంప్స్‌ను తాకింది. స్టంప్స్ కూడా పడిపోయాయి. కానీ అతను అవుట్ కాలేదు. ఎందుకంటే, ఆర్‌సీబీ ఆటగాళ్లు అప్పీల్ చేయలేదు. అదే ఓవర్లో రహానే ఒక సిక్స్ తో తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

క్వింటన్ డి కాక్ 4 పరుగులు చేసి ఔటయ్యాడు. జోష్ హేజిల్‌వుడ్ బంతికి ఫోర్ కొట్టడం ద్వారా అతను జట్టు ఖాతాను తెరిచాడు. ఆ తర్వాతి బంతికే సుయాష్ శర్మ పెవిలియన్ చేర్చాడు. కానీ, డి కాక్ వచ్చిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అతను వికెట్ కీపర్ జితేష్ శర్మ చేతికి చిక్కాడు.

రహానే, నరైన్ 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఒకవైపు రహానే చెలరేగడంతో, అతని భాగస్వామి సునీల్ నరైన్ కూడా ఆర్‌సీబీ బౌలర్లను చెడుగుడు ఆడేసుకున్నారు. నెమ్మదిగా ఆట ప్రారంభించిన నరైన్.. రహానే దూకుడుతో ఊపందుకున్నాడు. దీంతో రెండో వికెట్‌కు 100 పరుగులు జోడించారు. వెస్టిండీస్ ఆల్ రౌండర్ 44 పరుగులకు అవుట్ కాగా, రహానే 31 బంతుల్లో 56 పరుగులు చేసి నిరాశ చెందాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification