IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 43 ఏళ్ల మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) వికెట్ కీపింగ్ మ్యాజిక్ కొనసాగుతోంది. గత కొన్ని మ్యాచ్‌ల్లో అద్భుతమైన స్టంపింగ్‌తో దృష్టిని ఆకర్షించిన ధోనీ ఈసారి అద్భుతమైన రనౌట్‌తో సంచలనం సృష్టించాడు.
లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ తరపున అబ్దుల్ సమద్ చివరి ఓవర్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇంతలో, మతీష్ పతిరానా చెన్నై తరపున బౌలింగ్ చేస్తున్నాడు. పతిరనా 20వ ఓవర్‌లోని 2వ బంతిని వైడ్‌గా వేశాడు.
బంతి వికెట్ కీపర్ చేతికి చేరేలోపు రిషబ్ పంత్ నాన్-స్ట్రైక్ నుంచి పరుగెత్తుకుంటూ ఓ పరుగు తీసేందకు ప్రయత్నించాడు. అబ్దుల్ సమద్ అవతలి వైపు నుంచి నాన్-స్ట్రైక్ వైపు పరిగెడుతుండగా, ధోని అండర్ ఆర్మ్ త్రో విసిరాడు. బంతి గాల్లో తేలి నేరుగా వికెట్‌ను తాకింది.
ధోని అబ్దుల్ సమద్‌ని రన్ ఔట్ చేసిన వీడియో..
#MSDhoni𓃵 No Looks throw
There is no better wicketkeeper than Dhoni.
Dhoni is performing brilliantly regardless of his age. 😍
Dhoni’s name will not be forgotten as long as cricket exists.#LSGvsCSK #CSKvsLSG pic.twitter.com/yvXiZZcWE5
— Shashi Kumar Reddy Vura (@vurashashi) April 14, 2025
ఈ అద్భుతమైన అండర్ ఆర్మ్ త్రో రనౌట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో అభిమానులు ధోని కీపింగ్ సామర్థ్యంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 166 పరుగులు మాత్రమే చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన చెన్నై సూపర్ కింగ్స్ 19.3 ఓవర్లలో 168 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇరు జట్లు:
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్(కీపర్, కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, అవేష్ ఖాన్, ఆకాష్ దీప్, దిగ్వేష్ సింగ్ రాఠీ.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, జామీ ఓవర్టన్, MS ధోని(కీపర్, కెప్టెన్), అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణ.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..