Video: 11 బంతుల్లో విధి రాతనే మార్చేసిన వింటేజ్ ధోని.. 30వ మ్యాచ్‌లో మైండ్ బ్లోయింగ్ నాక్

Written by RAJU

Published on:


MS Dhoni: ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన 30వ మ్యాచ్‌లో, చెన్నై సూపర్ కింగ్స్ తమ వరుస ఓటములకు చెక్ పెట్టేసింది. లక్నోపై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 166 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా చెన్నై 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయ లక్ష్యాన్ని చేరుకుంది. ఈ విజయంలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కీలక పాత్ర పోషించాడు, అంటే మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. శివం దూబే కూడా అతనికి మద్దతుగా నిలిచాడు. ఈ ఇద్దరూ కలిసి జట్టును విజయపథంలో నడిపించారు. ధోని కేవలం 11 బంతుల్లోనే మ్యాచ్ గమనాన్ని మార్చాడు. ఈ విజయం సాధించినప్పటికీ, చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో 10వ స్థానంలోనే నిలిచింది.

క్లిష్ట సమయంలో క్రీజులోకి ధోని..

జట్టు గెలవడానికి 30 బంతుల్లో 55 పరుగులు అవసరమైన సమయంలో చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రీజులోకి వచ్చాడు. కానీ, ఆ తర్వాత ధోని తన తుఫాన్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్ గమనాన్నే మార్చేశాడు. అతను కేవలం 11 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ తో 26 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ధోని సింగిల్ హ్యాండ్‌తో సిక్స్‌ కొట్టి ఫ్యాన్స్‌కు మరపురాని గిఫ్ట్ అందించాడు. అతను ఇంపాక్ట్ ప్లేయర్ శివం సింగ్‌తో కలిసి 27 బంతుల్లో 56 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. శివం సింగ్ 37 బంతుల్లో 2 సిక్సర్లు, 3 ఫోర్లతో 43 పరుగులతో అజేయంగా నిలిచాడు. 7 మ్యాచ్‌ల్లో చెన్నైకి ఇది రెండో విజయం. కానీ, ఇప్పటికీ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలవడం గమనార్హం. పాయింట్ల పట్టికలో లక్నో జట్టు నాల్గవ స్థానంలో ఉంది.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ధోనీ..

లక్నోతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ధోని ఒక క్యాచ్, ఒక స్టంపింగ్, ఒక రనౌట్ తీసుకున్నాడు. ఆ తర్వాత దూకుడుగా బ్యాటింగ్ చేసి వరుసగా ఐదు మ్యాచ్‌ల ఓటములకు బ్రేక్ వేశాడు. ఈ మ్యాచ్ సందర్భంగా చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఆయుష్ బదోనిని స్టంప్ చేయడం ద్వారా ఐపీఎల్‌లో తన 200వ వికెట్‌ను సాధించాడు. దీంతో మొదటి ఐపీఎల్ ఆటగాడిగా నిలిచాడు. దినేష్ కార్తీక్, వృద్ధిమాన్ సాహా ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో నిలిచారు. కానీ, వీరు ధోని కంటే చాలా వెనుకబడి ఉన్నారు. మ్యాచ్ సమయంలో, మహేంద్ర సింగ్ ధోని తన చురుకుదనంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్‌లో 20వ ఓవర్ మొదటి బంతికే అబ్దుల్ సమద్‌ను అద్భుతంగా అవుట్ చేయడం ద్వారా అతను అందరినీ ఆశ్చర్యపరిచాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights