Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్.. కట్‌చేస్తే.. రివర్స్ పంచ్ అదుర్స్

Written by RAJU

Published on:


Phil Salt 105 Meters Six: చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లో పర్యాటక జట్టు గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ నిర్ణయం సరైనదేనని నిరూపితమైంది. పవర్‌ప్లేలోనే ముగ్గురు బెంగళూరు బ్యాటర్లను గుజరాత్ టైటాన్స్ పెవిలియన్ చేర్చింది.

ఈ క్రమంలో ఫిల్ సాల్ట్ ఓ డేంజరస్ సిక్స్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేశాడు. అది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తన పవర్‌ప్లేలో ఓ హైలెట్ సీన్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మ్యాచ్ 5వ ఓవర్లో సాల్ట్ మహమ్మద్ సిరాజ్‌ బౌలింగ్‌లో చెలరేగాడు. ఆ ఓవర్ 3వ బంతికి 105 మీటర్ల సిక్స్‌ బాదేశాడు. ఈ సిక్స్ ఏకంగా చిన్నస్వామి స్టేడియం పైకప్పుపైకి చేరింది.

ఈ 105 మీటర్ల సిక్స్‌ టోర్నమెంట్‌లో సంయుక్తంగా అత్యధిక దూరం వెళ్లిన సిక్స్‌గా మారింది. ఐపీఎల్ 2025లో టాప్ ఐదు సిక్స్‌లను ఓసారి పరిశీలిస్తే.. రాజస్థాన్ రాయల్స్‌‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ట్రావిస్ హెడ్ 105 మీటర్ల సిక్స్ కొట్టాడు.

IPL 2025 లో 5 భారీ సిక్సర్లు..

ప్రస్తుతం మ్యాచ్ గురించి మాట్లాడితే.. బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్‌కు 170 పరుగుల టార్గెట్ అందించింది. ప్రస్తుతం గుజరాత్ జట్టు 9 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 74 పరుగులు చేసింది. సుదర్శన్ 32, బట్లర్ 26 పరుగులతో క్రీజులో నిలిచారు. గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ 14 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification
Verified by MonsterInsights