Krunal Pandya Scares Venkatesh Iyer With A Deadly Bouncer: ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ ఉత్కంఠభరితంగా ప్రారంభమైంది. టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్‌సీబీకి మంచి ఆరంభం దక్కది. క్వింటన్ డి కాక్‌ను ఆరంభంలోనే పెవిలియన్ చేర్చారు. కానీ అజింక్య రహానె, సునీల్ నరైన్ రెండో వికెట్‌లో అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పి బెంగళూరుకు బిగ్ షాక్ ఇచ్చారు. అయితే, మిడిల్ ఓవర్లలో కృనాల్ పాండ్యా రెండు కీలక వికెట్లు తీయడంతో బెంగళూరు జట్టు కూడా తిరిగి పుంజుకుంది.
అయ్యర్‌ను బౌన్సర్‌తో భయపెట్టిన కృనాల్..
పాండ్య మొదట హాఫ్ సెంచరీ చేసి ఫుల్ ఫాంలో ఉన్న కెప్టెన్ అజింక్య రహానెను పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత కేకేఆర్ తరపున రూ. 23.75 కోట్లకు కొనుగోలు చేసిన వెంకటేష్ అయ్యర్‌ను భయపెట్టి మరీ పెవిలియన్ చేర్చాడు.
ఇవి కూడా చదవండి
— kuchnahi123@12345678 (@kuchnahi1269083) March 22, 2025
ముఖ్యంగా, పాండ్యా తన 3వ ఓవర్ వేయడానికి వచ్చాడు. ఈ క్రమంలో అయ్యర్ తన హెల్మెట్‌ను తీసేశాడు. అయితే, మొదటి బంతిని పదునైన బౌన్సర్‌తో కృనాల్ భయపెట్టాడు. ఇది వైడ్‌గా వెళ్లింది. దీని ఫలితంగా అంపైర్ వైడ్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు అయ్యర్‌కు హెల్మెట్ ధరించమని సూచించాడు. ఇంతలో, పాండ్య ఒక ఫుల్లర్ డెలివరీ వేసి, తర్వాతి బంతికి అయ్యర్ స్టంప్స్‌ను పడగొట్టాడు.
వెంకటేష్ అయ్యర్ తన 23.75 కోట్ల ధరను సమర్థించుకోవడంలో విఫలమయ్యాడు. ఔట్ అయిన వెంటనే ఇంటర్నెట్‌లో ట్రోలింగ్‌కు గురయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే కోల్‌కతా జట్టు 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. దీంతో బెంగళూరు జట్టుకు 175 పరుగుల టార్గెట్ లభించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..