Video: వామ్మో.. కాంతి కంటే వేగంగా.. కళ్లు మూసి తెరిచేలోపే ఫినిష్.. ధోని స్టంపింగ్ చూశారా భయ్యా?

Written by RAJU

Published on:


MS Dhoni Vintage Stumping Philip Salt Video: చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతోన్న హై-వోల్టేజ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అద్భుతమైన స్టంపింగ్‌తో ఆకట్టుకున్నాడు. ధోని మెరుపు కన్నా వేగంతో బెయిల్స్‌ను చెదరగొట్టాడు. దీంతో ఫిల్ సాల్ట్‌ లాంటి డేంజరస్ ప్లేయర్ నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది.

ఫిల్ సాల్ట్‌ను ఆశ్చర్యపరిచిన ధోని..

ఆర్‌సీబీ తరుపున ఫిల్ సాల్ట్ విరుచుకపడుతున్నాడు. ఈ క్రమంలో చెన్నై తన తొలి బ్రేక్‌త్రూ కోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో ఇన్నింగ్స్ ఐదవ ఓవర్లో ఈ సంఘటన జరిగింది. ఫామ్‌లో ఉన్న స్పిన్నర్ నూర్ అహ్మద్‌ను రంగంలోకి దించాలని చెన్నై (CSK) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నిర్ణయం తీసుకున్నాడు. ఫామ్‌లో ఉన్న సాల్ట్‌ ఈ నిర్ణయానికి బలయ్యాడు.

ఇవి కూడా చదవండి

ధోని స్టంపింగ్ వీడియో..

ఓవర్ ది వికెట్ నుంచి నూర్ బంతిని పైకి విసిరాడు. ఫిల్ సాల్ట్ ఆఫ్-సైడ్ ఫీల్డ్ పైకి ఏరియల్ ఆడేందుకు ఆహ్వానించాడు. ఫిల్ సాల్ట్ మాత్రం లాఫ్టెడ్ షాట్ కోసం వెళ్ళగా, బంతి అతని బయటి అంచున తాకింది. వెంటనే ఎంఎస్ ధోని స్టంప్స్ వెనుక బంతిని సేకరించాడు.ఆ వెంటనే సాల్ట్ తన బ్యాక్ ఫుట్‌ను తిరిగి క్రీజులోకి తీసుకురావడానికి ముందే, ధోని రెప్పపాటులో బెయిల్స్‌ను తొలగించి, ఇంగ్లీష్ బ్యాటర్‌ను డగౌట్‌కు పంపాడు.

అంతకుముందు, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్‌ను అవుట్ చేయడానికి ధోని అచ్చం ఇలాంటి స్టంపింగ్‌నే చేశాడు. ఆర్‌సీబీతోనూ ఇదే మ్యాజిక్ రిపీట్ చేసి అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు.

ఇబ్బందుల్లో బెంగళూరు..

నూర్ సాల్ట్‌ను ఔట్ చేసిన తర్వాత, దేవ్‌దత్ పడిక్కల్‌ను రవిచంద్రన్ అశ్విన్ అవుట్ చేశాడు. సౌత్‌పావ్ అవుట్ చేయడంతో కెప్టెన్ రజత్ పాటిదార్ క్రీజులోకి వచ్చాడు. ఆ తర్వాత నూర్ మరోసారి బెంగళూరుకు బిగ్ షాక్ ఇచ్చాడు. విరాట్ కోహ్లీ 31 పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు. ప్రస్తుతం 14.2 ఓవర్లకు 3 వికెట్లకు 136 పరుగులు చేసింది. పాటిదార్ 36, లివింస్టన్2 పరుగులతో బ్యాటింగ్ చేశారు.

Subscribe for notification
Verified by MonsterInsights