Video: రీడింగ్‌ మిషన్‌ షేక్‌.. పోలీసులు షాక్‌.. వాటర్‌ ట్యాంకర్‌ డ్రైవరా మజాకా! – Telugu Information | Water tanker driver caught in drunk and driving by Panjagutta visitors police

Written by RAJU

Published on:

పట్టపగలు పీకల దాకా మందు కొట్టి.. ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు వాటర్ ట్యాంకర్ డ్రైవర్. మద్యం మత్తులో రోడ్డుమీద ప్రమాదకరంగా డ్రైవ్‌ చేస్తూ వచ్చాడు. ఉప్పల్‌ నుంచి పంజాగుట్ట మీదుగా అమీర్‌పేట వైపు వెళుతున్న వాటర్‌ ట్యాంకర్‌ను పంజాగుట్ట పోలీసులు ఆపి చెక్‌ చేశారు. డ్రైవర్‌ మద్యం మత్తులో ఉండటంతో బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించారు పంజాగుట్ట ట్రాఫిక్ ఎస్ ఐ ఆంజనేయులు. 325 బీ ఏ సీ పాయింట్స్ రావడంతో ట్రాఫిక్‌ పోలీసులు అవాక్కయ్యారు. ట్యాంకర్ డ్రైవర్ యాదగిరి మీద కేసు నమోదు చేశారు. అనంతరం ట్యాంకర్ ను సీజ్ చేశారు.

అయితే, డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల్లో బ్రీత్ ఎనలైజర్ మిషన్ ద్వారా.. ఆల్కహాల్ శాతం ఎంతుందో తెలుసుకుంటారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే వారిని ఆపి బ్రీత్ ఎనలైజర్ ద్వారా తాగింది లేనిది పోలీసులు నిర్ధారిస్తారు. 100 మి.లీ రక్తంలో ఆల్కహల్ శాతం 30 మిల్లీ గ్రాములు దాటితే కేసు నమోదు చేస్తారు. 50 మి.గ్రాముల ఉంటే ఆ వ్యక్తి స్పృహాలో లేనట్లు గుర్తిస్తారు. బ్రీత్ అనలైజర్‌లో వందకు మించి రీడింగ్ నమోదైన సందర్భాలు లేకపోలేదు. కానీ, సోమవారం పంజాగుట్ట పోలీసుల తనిఖీల్లో చోటుచేసుకున్న సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ట్యాంకర్‌ డ్రైవర్‌ యాదగిరి గాలి ఊదగానే బ్రీత్‌ ఎనలైజర్‌ మిషన్ షేకయ్యింది. తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసుల కళ్లు కూడా బైర్లు కమ్మాయి. ఏకంగా 325 రీడింగ్ నమోదుకావడంతో అంతా షాకయ్యారు.

వీడియో చూడండి:

Subscribe for notification