Video: మ్యాచ్‌ తర్వాత స్టార్‌ క్రికెటర్ల మధ్య గొడవ! వీడియో తీస్తున్న కెమెరామెన్‌ను కూడా..

Written by RAJU

Published on:


ఐపీఎల్‌ 2025లో భాగంగా ఈ నెల 8వ తేదీనా ముల్లాన్‌ పూర్‌ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్‌ పోటీ పడింది. ఈ కింగ్స్‌ పోరులో పంజాబ్‌ విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌ తర్వాత పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ బౌలర్‌ ఖలీల్‌ అహ్మద్‌ మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గొడవ పడితే మ్యాచ్‌ తర్వాత గొడవ పడాలి కానీ, మ్యాచ్‌ అయిపోయిన తర్వాత ఈ ఇద్దరి మధ్య గొడవ ఎందుకు జరిగిందని ఆలోచిస్తున్నారా? అందుకు కారణం మ్యాచ్‌లో జరిగిన ఓ సంఘటనే.

ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌ చేస్తున్న క్రమంలో ఖలీల్‌ అహ్మద్‌ తన మూడో ఓవర్‌ నాలుగో బంతికి శ్రేయస్‌ అయ్యర్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ఆరంభంలోనే పంజాబ్‌ రెండో వికెట్‌ కోల్పోవడం, అందులోనా పంజాబ్‌ కెప్టెన్‌, సూపర్ ఫామ్‌లో ఉన్న శ్రేయస్‌ అవుట్‌ కావడంతో ఖలీల్‌ అహ్మద్‌ తనదైన శైలిలో సెలబ్రేట్‌ చేసుకున్నాడు. అయితే అదే ఓవర్‌లో రెండో బంతికి అయ్యర్‌ సూపర్ సిక్స్‌ కొట్టడం, తన బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టిన అయ్యర్‌ను వెంటనే క్లీన్‌ బౌల్డ్‌ చేశాననే గర్వం ఖలీల్‌లో కాస్త కనిపించింది. అలాగే అవుట్‌ చేశాకా.. అయ్యర్‌ వైపు చూస్తూ ఖలీల్‌ సెలబ్రేట్‌ చేసుకున్నాడు. ఇదే విషయంపై అయ్యర్‌ మ్యాచ్‌ అయిపోయిన తర్వాత ఖలీల్‌ను అడిగినట్లు తెలుస్తోంది.

అంత ఓవర్‌ అగ్రెసివ్‌గా నావైపు చూస్తూ.. సెలబ్రేట్‌ చేసుకోవాల్సిన అవసరం ఏంటని ఖలీల్‌ను క్వశ్చన్‌ చేయడంతో ఖలీల్‌ కూడా అంతే అగ్రెసివ్‌గా రియాక్ట్‌ అవుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ సీన్స్‌ సెల్‌ఫోన్‌లో షూట్‌ చేస్తున్న క్రికెట్‌ అభిమానులు గొడవ పడొద్దు అంటూ క్రికెటర్లను కోరుతుండటం కూడా వినిపిస్తోంది. అయితే.. అయ్యర్‌, ఖలీల్‌ అహ్మద్‌ మధ్య జరుగుతున్న ఈ హీటెడ్‌ సంభాషణను ఓ కెమెరామెన్‌ షూట్‌ చేస్తుంటే.. అయ్యర్‌, ఖలీల్‌ ఇద్దరూ అతన్ని వారించడం కూడా వీడియోలో చూడొచ్చు. ఇలా ఈ ఇద్దరు ఆటగాళ్లు మ్యాచ్‌ తర్వాత కాస్త గరం గరంగానే మాట్లాడుకున్నారు. కానీ, కొద్ది సేపటి తర్వాత ఇద్దరు ఆటగాళ్లు నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights