Video: నీకు సిగ్గులేదా నన్ను బ్యాట్ అడుగుతున్నావు! సర్ఫరాజ్ తమ్ముడికి వార్నింగ్ ఇచ్చిన 14 ఏళ్ళ రాజస్థాన్ బుల్లోడు!

Written by RAJU

Published on:


ఐపీఎల్ 2025లో భాగంగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌కు మళ్లీ ప్రేక్షకులు ఆసక్తిగా రాబట్టేలా ఏర్పాటైంది. అయితే ఈ మ్యాచ్ కంటే ముందే రాజస్థాన్ రాయల్స్ జట్టులోని ఓ చిన్నోడి సరదా సంభాషణ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ చిన్నోడే 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. జూనియర్ క్రికెట్‌లో తన పవర్ హిట్టింగ్‌తో రాణించిన అతడు ఐపీఎల్‌లో ఎప్పుడు బరిలోకి దిగుతాడా అని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా నిలిచారు. కానీ ఈ సీజన్‌లో ఇప్పటివరకు అతడికి ఆడే అవకాశం రాలేదు.

ఇదే సందర్భంలో పంజాబ్ కింగ్స్ తమ సోషల్ మీడియా పేజ్ ద్వారా వైభవ్‌కు సంబంధించిన ఓ ఫన్నీ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ముషీర్ ఖాన్‌తో కలిసి వైభవ్ సరదాగా మాట్లాడుతున్నాడు. మైదానంలో వారిద్దరూ సరదాగా చాటింగ్ చేస్తూ కనిపించారు, ముషీర్ ఖాన్ – “ఇది నీ బ్యాటా, నాకూ ఇస్తావా?” అంటూ వైభవ్‌ను అడిగాడు. దానికి వైభవ్ సరదాగా – “ఇవ్వాలా? ఈ వ్యక్తికి అస్సలు సిగ్గు లేదు. జూనియర్ ప్లేయర్ నుంచి బ్యాట్ అడుగుతున్నాడు. నాకు గిఫ్ట్ ఇవ్వాల్సింది పోయి నన్నే అడుగుతున్నాడు,” అంటూ ఫన్నీగా స్పందించాడు.ఈ వీడియో కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

వైభవ్ తో సరదాగా మాట్లాడిన ముషీర్ ఖాన్ మరెవరో కాదు, అద్భుతమైన టెస్ట్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడే. ముషీర్ ప్రస్తుతం ముంబయి ప్రముఖ దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో సర్ఫరాజ్ ఖాన్ అమ్ముడుపోకపోయినా, అతని తమ్ముడైన ముషీర్‌ను పంజాబ్ కింగ్స్ రూ.30 లక్షల బేస్ ప్రైజ్‌కు కొనుగోలు చేసింది. ఇది కూడా క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరమైన అంశంగా మారింది.

ఇదిలా ఉండగా, ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్ మూడు మ్యాచుల్లో కేవలం ఒకటి మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదవ స్థానంలో ఉంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఆడిన రెండు మ్యాచులూ గెలిచి టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. గెలిచినా, ఆడకపోయినా… వైభవ్ సూర్యవంశీ – ముషీర్ ఖాన్ మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ మాత్రం అభిమానులను కాసేపు నవ్వుల బాటలోకి తీసుకెళ్లింది. ఇక ఈ చిన్నోడు బరిలోకి దిగితే మాత్రం ఏం చేస్తాడో అన్న ఉత్కంఠ మాత్రం ఇంకా కొనసాగుతోంది.

టాస్ గెలిచిన పిబికెఎస్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

ప్లేయింగ్ XI
RR: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(C), నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్ (WK), షిమ్రోన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, యుధ్వీర్ సింగ్ చరక్, సందీప్ శర్మ

PBKS: ప్రభ్‌సిమ్రాన్ సింగ్(WK), శ్రేయాస్ అయ్యర్(C), మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్‌వెల్, శశాంక్ సింగ్, సూర్యాంశ్ షెడ్జ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification
Verified by MonsterInsights