Video: తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్ పై MI హెడ్ కోచ్ క్లారిటీ! అసహనం వ్యక్తం చేసిన సూర్య భాయ్!

Written by RAJU

Published on:


తిలక్ వర్మను రిటైర్ అవుట్ చేసిన నిర్ణయం పెద్ద వివాదానికి దారి తీసిన వేళ, ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేలా జయవర్ధనె స్పందించారు. ఆ నిర్ణయం తానే తీసుకున్నదని స్పష్టంగా తెలిపారు. ముంబై ఇండియన్స్‌ తరఫున “ఇంపాక్ట్ ప్లేయర్”గా వచ్చిన తిలక్ వర్మ 23 బంతుల్లో 25 పరుగులు చేసి చివరి ఓవర్‌కు ముందే రిటైర్ అవుట్ అయ్యాడు. మ్యాచ్ తర్వాత మీడియాతో మాట్లాడిన జయవర్ధనె, తిలక్ మిడిల్‌లో ఎక్కువ సమయం గడిపినప్పటికీ, షాట్లు క్లియర్ చేయడంలో తడబడడంతో, తాజా ఆటగాడిని దించాలనే వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.

“తిలక్ మూడవ వికెట్ పడిన తర్వాత మంచి భాగస్వామ్యం అందించాడు. కానీ చివరి ఓవర్లలో దూకుడుగా ఆడాలని అనుకున్నా, బంతిని సరిగా టైమ్ చేయలేకపోయాడు. ఎక్కువ సేపు మిడిల్‌లో ఉన్నందున చివర్లో హిట్స్ వచ్చేమో అనుకున్నాం. కానీ ఆ సమయంలో తాజాగా వచ్చిన ఆటగాడిని పంపితే బెటర్ అని భావించాను. ఆ నిర్ణయం తేలికైనది కాదు కానీ, మ్యాచ్ పరిస్థితిని బట్టి తీసుకోవాల్సి వచ్చింది. ఇది పూర్తిగా వ్యూహాత్మక నిర్ణయమే,” అని జయవర్ధనె వివరించారు.

ఇక బ్యాటింగ్‌లో హార్దిక్ పాండ్యా విఫలమైనా, బౌలింగ్‌లో మాత్రం చరిత్ర సృష్టించాడు. తన టీ20 కెరీర్‌లోనే తొలి ఐదు వికెట్లు తీసిన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. హార్దిక్‌ తన 4 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. అందులో మార్క్రమ్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్, డేవిడ్ మిల్లర్ వంటి కీలక ఆటగాళ్ల వికెట్లు ఉన్నాయి. చివరి ఓవర్‌లో అకాశ్ దీప్‌ను అవుట్ చేసి తన స్పెల్‌ను ఘనంగా ముగించాడు.

“పవర్‌ప్లేలో ఎక్కువ రన్స్ వెళ్లిపోయాయి. అప్పుడు స్పీడ్ తగ్గించి బౌలింగ్ చేయాల్సింది. హార్దిక్ అనుభవంతో పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. బ్యాక్ ఆఫ్ లెంగ్త్ బౌలింగ్‌తో ఆటను మళ్లీ మామూలు స్థాయికి తెచ్చాడు. అతడి స్పెల్‌తో గేమ్ మళ్లీ మాకొక అవకాశంగా మారింది,” అని జయవర్ధనె ప్రశంసించారు.

MI ప్లేయింగ్ XI: విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్ (wk), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (c), నమన్ ధీర్, రాజ్ బావా, మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్, దీపక్ చాహర్, విఘ్నేష్ పుత్తూర్.

LSG ప్లేయింగ్ XI: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (c/wk), ఆయుష్ బడోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, దిగ్వేష్ సింగ్ రాఠీ, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification
Verified by MonsterInsights