Video: గ్రౌండ్‌లో ప్రేయసి.. హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రియుడు.. కట్‌చేస్తే.. ఐపీఎల్ హిస్టరీలో చెత్త రికార్డ్.. అదేంటంటే?

Written by RAJU

Published on:


Yashasvi Jaiswal hit Slowest Half Century In IPL History: టీమిండియా ఫ్యూచర్ స్టార్స్‌లో యశస్వి జైస్వాల్ ఒకడిగా పేరుగాంచాడు. గత ఏడాది కాలంగా అంతర్జాతీయ స్థాయిలో చాలా బాగా రాణించాడు. దీంతో ఐపీఎల్‌లో కూడా ఆకట్టుకుంటాడని అంతా భావించారు. కానీ, ఈ యంగ్ ఇండియన్ ప్లేయర్ ఐపీఎల్ 2025లో మొదటి మూడు మ్యాచ్‌లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.

ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన నాల్గవ మ్యాచ్‌లో ఎలాగైన సరే భారీ ఇన్నింగ్స్ ఆడాలని పట్టుదలతో క్రీజులో నిలిచాడు. దీంతో 40 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కానీ, రికార్డుల పరంగా ఐపీఎల్ చరిత్రలో జైస్వాల్ అత్యంత స్లో హాఫ్ సెంచరీ నమోద చేశాడు. జైస్వాల్ గతంలో అంటే ఐపీఎల్ 2022లో చెన్నైపై 39 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. దీంతో యశస్వి జైస్వాల్ ఆత్మవిశ్వాసం ఎంత తక్కువగా ఉందో చూపిస్తుంది. అతను సహజంగానే దూకుడుగా ఉండే బ్యాట్స్‌మెన్ అని తెలిసిందే. అయితే, హాఫ్ సెంచరీ తర్వాత వేగంగా రాణించి, చివరికి 45 బంతుల్లో 67 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్‌లో యశస్వి జైస్వాల్ అత్యంత స్లో హాఫ్ సెంచరీలు..

సంవత్సరం బంతులు
2025 40 వర్సెస్ పంజాబ్
2022 39 వర్సెస్ చెన్నై
2023 35 వర్సెస్ పంజాబ్
2023 34 వర్సెస్ హైదరాబాద్

ఐపీఎల్ 2025లో భాగంగా 18వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) పంజాబ్ కింగ్స్ (PBKS) కు 206 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 205 పరుగులు చేసింది. ఈ స్టేడియంలో ఇదే అత్యధిక ఐపీఎల్ స్కోరు.

మైదానంలో జైస్వాల్ ప్రేయసి..

చాలా కాలంగా జైస్వాల్ హామిల్టన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. మాడ్డీ హామిల్టన్, ఆమె సోదరుడు హెన్రీ హామిల్టన్‌తో కలిసి స్టాండ్ల నుంచి జైస్వాల్‌ను ఉత్సాహపరుస్తూ కనిపించారు. దీంతో ప్రేమ పుకార్లు మరింత ఎక్కువ అయ్యాయి. జైస్వాల్ ప్రతి పరుగుకు ఇద్దరూ మద్దతు ఇస్తూ నినాదాలు చేశారు. అయితే, ప్రేమ వ్యవహారంపై జైస్వాల్ లేదా మాడ్డీ ఇద్దరూ ఏమీ స్పష్టం చేయలేదు. జైస్వాల్ ఆడే క్రికెట్ మ్యాచ్‌లలో ఆమె తరచుగా కనిపిస్తుంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification
Verified by MonsterInsights