ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ప్రారంభానికి ముందే, భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన విశ్లేషణలు, వ్యూహాలను పంచుకుంటూ వార్తల్లో నిలుస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్రాంచైజీలో తిరిగి చేరేందుకు సిద్ధమవుతున్న అశ్విన్, తన యూట్యూబ్ ఛానెల్‌లో ప్రముఖ క్రికెట్ జర్నలిస్ట్ విమల్ కుమార్‌తో కలిసి IPL గురించి మాట్లాడాడు. ఈ సందర్భంగా, ముంబై ఇండియన్స్ (MI), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య మ్యాచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అశ్విన్ తన మాటల్లో ముంబై ఇండియన్స్ మెంటర్ సచిన్ టెండూల్కర్-గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ పేర్లను ప్రస్తావించడంతో, అభిమానుల దృష్టి ఒక్కసారిగా ఆ వ్యాఖ్యలపై కేంద్రీకృతమైంది. అయితే, అశ్విన్ అనూహ్యంగా సారా టెండూల్కర్‌ను కూడా సూక్ష్మంగా ఆటపట్టించాడని అనుమానాలు వెల్లువెత్తాయి.
అశ్విన్ వ్యాఖ్యల వెనుక సారా టెండూల్కర్ పుకార్లు!
తన యూట్యూబ్ ఛానెల్‌లో విమల్ కుమార్తో మాట్లాడుతున్న అశ్విన్, సచిన్ టెండూల్కర్-శుభ్‌మాన్ గిల్ గురించి మాట్లాడుతుండగా, చమత్కారంగా ఇలా అన్నాడు: “ఏక్ తారాఫ్ సచిన్ టెండూల్కర్ హై, దుస్రీ తారాఫ్ శుభ్‌మాన్ గిల్, GT కా కెప్టెన్. తీక్ హై, బాత్ కరో.” (ఒక వైపు సచిన్ ఉంటె మరోవైపు శుభ్‌మాన్ గిల్ ఉన్నాడు)
ఈ వ్యాఖ్యతోనే అభిమానులు తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా, శుభ్‌మాన్ గిల్ సారా టెండూల్కర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు గత కొంతకాలంగా ఇంటర్నెట్‌లో పుకార్లు ఉన్నాయి. సోషల్ మీడియాలో వారిద్దరి మధ్య సంబంధాన్ని ఊహిస్తూ అనేక పోస్టులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అశ్విన్ అలా అనడంతో, అతను సారా టెండూల్కర్‌ను ట్రోలింగ్ చేస్తున్నట్లు అనిపించింది.
అశ్విన్ మాటల తీరును బట్టి, అతను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేశాడా? అన్నది ఓ ప్రశ్నగా మారింది. అయితే, అభిమానులు మాత్రం “అశ్విన్ ఆటపట్టించడం స్పష్టంగా కనిపిస్తోంది” అంటూ చర్చించుకుంటున్నారు.
ఇక రవిచంద్రన్ అశ్విన్ విషయానికి వస్తే, అతను ఈ ఏడాది ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులో తిరిగి అడుగుపెట్టాడు. గతేడాది CSK ఫ్రాంచైజీ మెగా వేలంలో అతన్ని ఎంపిక చేసుకుంది. దీంతో, మళ్లీ తన ఇంటి జట్టు అయిన చెన్నై తరఫున ఆడేందుకు అశ్విన్ సిద్ధమవుతున్నాడు.
క్రితం సంవత్సరంలో, అశ్విన్ తన అంతర్జాతీయ టెస్ట్ కెరీర్‌కు గుడ్‌బై చెబుతూ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియాలో జరిగిన 2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఐపీఎల్ 2025లో మాత్రం CSK తరఫున చెలరేగేందుకు రెడీ అవుతున్నాడు.
Ashwin is out of control these days😭 https://t.co/2iQJorBClW pic.twitter.com/UeFeRnumfj
— Amaan🏏📈 (@devilscricket) March 18, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..