ఐపీఎల్ (IPL) 2025లో భాగంగా నిన్న ఆదివారం జరిగిన 11వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. రియాన్ పరాగ్ కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్ కూడా తొలి విజయాన్ని సాధించింది. కానీ, ఈ విజయం మధ్యలో, రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ ఓ చెత్త పనితో సోషల్ మీడియా వ్యాప్తంగా సంచలనంగా మారాడు. రియాన్ పరాగ్ వైఖరిపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే, కొందరేమో అతడికి సపోర్ట్‌గా నిలిచారు. అసలు రియాన్ పరాగ్ మ్యాచ్ తర్వాత ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..
అభిమానులకు తన యాటిట్యూడ్ చూపించిన రియాన్ పరాగ్..
నిజానికి, రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో రియాన్ పరాగ్ మైదానంలో కొంతమంది అభిమానులతో ఫొటో తీసుకుంటున్నట్లు కనిపించింది. రియాన్ పరాగ్ ఆ అభిమానుల పట్ల యాటిట్యూట్ చూపించాడు. సెల్ఫీ తీసుకున్న తర్వాత మొబైల్‌ను అభిమానుల వైపు విసిరి ముందుకు సాగాడు. ఫ్యాన్స్ ముందు తన యాటిట్యూట్ చూపించడంతో నెటిజన్లకు ఇది నచ్చలేదు. దీంతో విమర్శలు గుప్పిస్తున్నారు.
Riyan parag you have to learn many things as a player also pic.twitter.com/uKDj96lmw3
— SmithianEra (@NivedhM38443) March 31, 2025
రియాన్ పరాగ్ తన వైఖరితోపాటు దురుసుతనం కారణంగా సోషల్ మీడియాలో విమర్శలకు గురికావడం ఇదే మొదటిసారి కాదు. దీనికి ముందు కూడా అనేక చర్యలు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించాయి. చాలా సందర్భాలలో రియాన్ పరాగ్ తన వైఖరితో ట్రోల్ అయ్యాడు. కానీ, ఈ మధ్య అతను తన ప్రవర్తనను కూడా మెరుగుపరుచుకున్నట్లు అంతా భావించారు. కానీ, ఈ సీజన్లో రియాన్ వైఖరి మళ్లీ మొదటికే వచ్చిందని ఈ వీడియో తెలియజేస్తుంది.
భారత్ తరపున రియాన్ పరాగ్ అరంగేట్రం..
ఐపీఎల్ 2024 రియాన్ పరాగ్‌కు ఊహించనిదే జరిగింది. మొదటగా టీం ఇండియాలోకి అడుగుపెట్టాడు. రియాన్ పరాగ్ మొదట టీ20 ఫార్మాట్‌లో భారత జట్టు తరపున అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అతను వన్డే జట్టులోకి ప్రవేశించాడు. ఇప్పటివరకు ఈ ఆటగాడు టీం ఇండియా తరపున 9 టీ20 మ్యాచ్‌లు, 1 వన్డే మ్యాచ్ ఆడాడు. ఈ ఆటగాడి అంతర్జాతీయ కెరీర్ ఎంతకాలం కొనసాగుతుందో చూడటం ముఖ్యం. కాగా, ఈ ఆటగాడు చాలా సంవత్సరాలుగా రాజస్థాన్ జట్టు తరపున ఐీఎల్ ఆడుతున్నాడు. ప్రతీ సంవత్సరం ఈ జట్టు ఈ ఆటగాడిని రిటైన్ చేసుకుంటుంది. ప్రస్తుతం, రియాన్ పరాగ్ ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు 3 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. ఇఫ్పటి వరకు 3 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే మ్యాచ్‌లో విజయ అందుకున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..