Video: ఆనందంలో కావ్య పాప.. షాకైన హైదరాబాద్ కెప్టెన్.. కారణం 5వ ఓవర్.. ఎందుకో తెలుసా?

Written by RAJU

Published on:


ఐపీఎల్-18లో తొలి డబుల్ హెడర్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సంజు సామ్సన్ స్థానంలో రియాన్ పరాగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

6 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ ఒక వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ క్రీజులో ఉన్నారు. అభిషేక్ శర్మ 11 బంతుల్లో 24 పరుగులు చేసి ఔటయ్యాడు. మహిష్ తీక్షణ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ అతనికి క్యాచ్ ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఆర్చర్‌కి టార్చర్ చూపించిన హెడ్..

5వ ఓవర్ వేసిన జోఫ్రా ఆర్చర్‌కు ట్రావిస్ హెడ్ చుక్కలు చూపించాడు. ఈ ఓవర్‌లో మొత్తం 23 పరుగులు పిండుకున్నాడు. 4 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టిన హెడ్ బౌండరీలతో ఊచకోత కోశాడు.

ఎడమచేతి వాటం SRH ఓపెనర్ తన ఫ్రంట్ ఫుట్ క్లియర్ చేసి బంతిని మిడ్-వికెట్ ఫెన్స్ మీదుగా భారీ సిక్స్ బాదేశాడు. డిస్టెన్స్ మీటర్‌లో బంతి 105 మీటర్ల దూరం ప్రయాణించిందని చూపించింది. ఆ షాట్ ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేరింగ్‌కి చక్కని ఉదాహరణగా నిలిచింది. 

ఈ రోజు జరిగే రెండో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తమ అతిపెద్ద ప్రత్యర్థి జట్టు ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.

Subscribe for notification