Video: అరే ఆజామూ.. అసలు మనిషివేనా.. లేడీ ఫ్యాన్‌ని అలా వెక్కివెక్కి ఏడ్పిస్తావా.. ఏకిపారేస్తోన్న నెటిజన్లు

Written by RAJU

Published on:


Babar Azam Lady Fan Cries Video: పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2025 ఎడిషన్‌ బాబర్ ఆజంకు అస్సలు కలసి రావడం లేదు. వరుసగా విఫలమవుతూ తన ఫ్రాంచైజీనే కాదు, ఫ్యాన్స్‌ను కూడా నిరాశకు గురి చేస్తున్నాడు. తాజాగా ఓ అభిమాని తన వికెట్ చూసి ఏడ్వడం మొదలుపెట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. సోమవారం రావల్పిండిలో ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో పెషావర్ జల్మి కెప్టెన్ బాబర్ కేవలం 1 పరుగు మాత్రమే చేసి, పెవిలియన్ చేరాడు. దీంతో కోపోద్రిక్తురాలైన ఓ లేడీ అభిమాని.. మళ్లీ మళ్లీ అదే షాట్‌తో అవుట్ అవుతున్నాడంటూ ఏడుస్తోంది.

గ్లాడియేటర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో జల్మీ రెండు బంతులకు డకౌట్ చేరుకున్నాడు. తప్పనిసరిగా స్కోర్ చేయాల్సిన ఒత్తిడిలో ఉన్నాడు. దీంతో బాబర్ ఇస్లామాబాద్ యునైటెడ్ పేసర్ బెన్ ద్వార్షుయిస్‌కు బలయ్యాడు.

దీంతో ఈ లేడీ ఫ్యాన్ తెగి బాధపడిపోయింది. ఈ విధంగా ఔట్ కావడం ఇది మొదటిసారి కాదంటూ, అదే షాట్ ఆడుతూ ఔట్ అవుతున్నాడంటూ కన్నీరు పెట్టుకుంది.

పెషావర్ జల్మీ మరో భారీ ఓటమి..

తొలి మ్యాచ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ చేతిలో 80 పరుగుల తేడాతో ఓడిపోయిన జల్మీ, డిఫెండింగ్ ఛాంపియన్స్ చేతిలో 102 పరుగుల తేడాతో ఓడిపోయింది. 244 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రెండో ఓవర్లోనే బాబర్‌ వికెట్ కోల్పోయింది. ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. రెండంకెల స్కోరు సాధించిన ముగ్గురు బ్యాట్స్‌మెన్లలో మహ్మద్ హారిస్ ఒకడు. హాఫ్ సెంచరీ దాటిన ఏకైక బ్యాట్స్‌మన్ ఇతనే.

జల్మి ఇన్నింగ్స్ 18.2 ఓవర్లు మాత్రమే కొనసాగింది. చివరికి ఇమాద్ వసీం మూడు వికెట్లు తీయడంతో 141 పరుగులకే ఆలౌట్ అయింది. సాహిబ్‌జాదా ఫర్హాన్ 52 బంతుల్లో 106 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights