Video: అంపైర్ నిర్ణయంపై ప్రస్ట్రేషన్.. కట్‌చేస్తే.. కేఎల్ రాహుల్‌తో గొడవపడిన కోహ్లీ.. ఏకిపారేస్తోన్న నెటిజన్స్

Written by RAJU

Published on:


Virat Kohli and KL Rahul Fight During DC vs RCB Match: ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్ సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వార్తల్లో నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కీపర్-బ్యాటర్ కేఎల్ రాహుల్‌తో వాగ్వాదం చేస్తున్నట్లు వీడియోలు వైరలవుతున్నాయి. ముఖ్యంగా కోహ్లీ ఏదో విషయంపై తన చేతులను చూపిస్తూ కేఎల్ రాహుల్‌తో వాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది.

గొడవకు అసలు కారణం?

ఇవి కూడా చదవండి

ఇద్దరి మధ్య సంభాషణ దేని గురించి అనేది స్పష్టంగా తెలియదు. కానీ అంపైర్ నిర్ణయంపై కోహ్లీ అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కేఎల్ రాహుల్ వద్దకు వెళ్లి అంపైర్ నిర్ణయంపై గొడవపడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఆర్‌సీబీ ఛేజింగ్‌లో కీలక పాత్ర పోషించిన కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ కింగ్ కోహ్లీ కొద్దిసేపటి తర్వాత తిరిగి వెళ్లి బ్యాటింగ్ కొనసాగించాడు.

ఆర్‌సీబీ విజయం..

ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే, ఢిల్లీ క్యాపిటల్స్ తరపున కేఎల్ రాహుల్ 39 బంతుల్లో 3 ఫోర్లతో అత్యధికంగా 41 పరుగులు చేశాడు. కాగా, ట్రిస్టన్ స్టబ్స్ 18 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 34 పరుగులు చేశాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ఎనిమిది వికెట్లకు 162 పరుగులు చేసింది. ఆర్‌సీబీ తరపున భువనేశ్వర్ కుమార్ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఈ లక్ష్యాన్ని బెంగళూరు జట్టు 4 వికెట్లు కోల్పోయి చేధించింది. కోహ్లీ 51 పరుగులు, కృనాల్ పాండ్య 73 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లేయింగ్ XI: ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ (కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ XI: విరాట్ కోహ్లీ, జాకబ్ బెథెల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, యష్ దయాల్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights