దేవుడి పెళ్లికి భారీగా తరలివచ్చిన శివపార్వతులు
వేదికపై ఓవైపు దేవతామూర్తులకు కళ్యాణోత్సవం వైభవంగా సాగుతుంటే, ఆ సన్నిధిలోనే జోగినీలు శివుడిని తమ నాధునిగా భావించి ధారణ చేస్తారు. కేవలం ఈ వివాహం కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా చత్తీస్గడ్, మహారాష్ట్ర ల నుండి వేలాదిగా భక్తులు తరలివస్తారు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్ ,జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, కొమరం భీం, మంచిర్యాల, ఆదిలాబాద్, జనగామ, వరంగల్, సిద్దిపేట, మెదక్ జిల్లాల నుండి ఎక్కువగా, ఇతర జిల్లాల నుండి సంఖ్య కాస్త తక్కువగా శివపార్వతులుగా మారిన స్రీలు,పురుషులు, పిల్లలు వేములవాడలో జరిగే శ్రీరామ నవమికి తప్పక హాజరవుతారు. సీతారామ చంద్రులకు తలంబ్రాలు సమర్పించే వేళ వేములవాడ రాజన్న సన్నిధిలో శివపార్వతుల వివాహ ఘట్టం తలంబ్రాల వర్షం కురుస్తున్నట్టు మారిపోతుంది.