Vegetarian states: దేశంలో ఇంత మంది శాకాహారులున్నారా..? అక్కడ ముక్క ముట్టుకుంటే నేరం.. ఇదే కారణం..

Written by RAJU

Published on:

గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలోని పాలిటానా నగరం మాంసాహార ఆహార అమ్మకం మరియు వినియోగాన్ని నిషేధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి నగరంగా చరిత్ర సృష్టించింది. మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా మొదటి శాకాహార నగరంగా ప్రసిద్దిగంచింది. అందుకనే శాకాహారులకు స్వర్గధామం. ఎందుకంటే ఈ ప్రదేశంలో నివసించే చాలా మంది ప్రజలు కఠినమైన శాఖాహారులుగా ప్రసిద్ధి చెందిన జైనులు. అందువల్ల ఈ నగరంలో పూర్తిగా శాఖాహార ఆహారాన్ని మాత్రమే అందిస్తారు. నగరంలో 250 కి పైగా మాంసం దుకాణాలను మూసివేయాలని డిమాండ్ చేస్తూ 200 మందికి పైగా జైన సన్యాసులు చేపట్టిన నిరసన ఫలితంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో, పాలిటానా నగరం ప్రపంచంలోనే మాంసాహార ఆహార అమ్మకం మరియు వినియోగాన్ని నిషేధించిన మొట్టమొదటి నగరంగా ప్రసిద్ధి చెందింది.

అగ్రస్థానంలో రాజస్తాన్..

ఇక మన దేశంలో ఎక్కువ శాఖాహారం తినే రాష్ట్రాల జాబితాను పరిశీలిస్తే రాజస్థాన్ అగ్రస్థానంలో ఉంది. రాజస్థాన్ జనాభాలో 74.9% మంది శాఖాహారులు ఉన్నారంట. ఇక రెండో స్థానంలో హరియాణా ఉంది. అక్కడ జనాభాలో 69.25% మంది శాకాహారులు ఉన్నారు. పంజాబ్ మూడో స్థానంలో ఉంది. రాష్ట్రం గోధుమలను అత్యధికంగా ఉత్పత్తి అవుతాయి. ఇక్కడి జనాభాలో 66.75% శాఖాహారులు ఉన్నారు. ఇక గుజరాత్ నాలుగో స్థానంలో ఉంది.. గుజరాత్ లో 60.95% మంది శాఖాహారులే.

ఇంతమంది వెజిటేరియన్లా?

మధ్యప్రదేశ్ ఐదో స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో సుమారు 50.6% జనాభా శాఖాహారులు ఉన్నారు. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ ఆరోస్థానంలో ఉంది. రాష్ట్రంలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.. ఇక్కడి జనాభాలో 47.1% మంది శాఖాహారులు ఉన్నారంట.

రాజధానిలోనూ ఇదే తీరు..

మహారాష్ట్రలో కూడా ఎక్కువ మంది శాఖాహారులు ఉన్నారు. రాష్ట్ర జనాభాలో 40.2% మంది శాఖాహారులు ఉన్నారు. ఇక జాబితాలో ఢిల్లీ 8వ స్థానంలో ఉంది. దేశ రాజధానిలో అనేక రాష్ట్రాలు నివసిస్తున్నప్పటికీ, దాని జనాభాలో 39.5% మంది శాఖాహారులు ఉన్నారంట. ఇక ఉత్తరాఖండ్ లో 27.35 శాతం మంది, కర్ణాటకలో 21.1 శాతం మంది శాఖాహారులు ఉన్నారు.

గంగానది తీరాన నిషేధం..

పవిత్ర గంగా నది తీరాన్న వెలసిన నగరం హరిద్వార్ లో మాంసాహారం నిషేధం. ఇక తమిళనాడు నడి బొడ్డు ఉన్న మధురై, హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముని జన్మస్థలం అయిన అయోధ్య, తమిళనాడులోని మధురై, ఉత్తర్ ప్రదేశ్ లోని బృందావన్ లో మాంసాహారం దొరకదు.

Subscribe for notification