- అమెరికా- చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం..
- యూఎస్ బోయింగ్ విమానాలు కొనుగోలు చేయొద్దని చైనా ఆదేశాలు..
- చైనా తీరుపై 245 శాతం సుంకాన్ని విధించిన అమెరికా..

US-China Trade Conflict: అమెరికా- చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మరోసారి యూఎస్ పంజా విసిరింది. డ్రాగన్ కంట్రీ దిగుమతి వస్తువులపై 245 శాతానికి పైగా సుంకాన్ని పెంచేశాడు డొనాల్డ్ ట్రంప్.. తమ వస్తువులపై ప్రతీకారంగా చైనా విధించిన దిగుమతి సుంకాలతోనే ఈ చర్యలకు దిగినట్లు తెలిపారు. యూఎస్ ఫస్ట్ ట్రేడ్ పాలసీ విధానంలో భాగంగా.. తాజాగా, అన్ని దేశాలపై ట్రంప్ దిగుమతి సుంకాన్ని పెంచాడు. కానీ, చైనాపై మాత్రం ఆ పెంపు మరీ ఎక్కువగా ఉంది.
Read Also: ATM in Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ట్రైన్లో ఏటీఎంలు..
ఇక, అమెరికా దిగుమతి సుంకాన్ని పెంచడంతో.. రెండు రోజుల క్రితం చైనా కూడా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా సంస్థ బోయింగ్ ఉత్పత్తి చేస్తున్న విమానాలను కొనుగోలు చేయొద్దని తమ దేశ ఎయిర్‌లైన్స్ సంస్థలకు డ్రాగన్ కంట్రీ ఆదేశాలు జారీ చేసింది. అలాగే, బోయింగ్ సంస్థ నుంచి విడిభాగాలు కూడా కొనుగోలు చేయరాదు అని చైనా తమ దేశ ఎయిర్‌లైన్స్ కంపెనీలకు పేర్కొనింది. ఈ ప్రకటన వెలువడిన తర్వాత రోజే అమెరికా ప్రతీకార చర్యలకు దిగింది. బీజింగ్ నుంచి ఇంపోర్ట్ అయ్యే అన్ని వస్తువుల మీద 245 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు వైట్‌హౌజ్ ప్రకటించింది.