US President Trump is indignant with Russian President Putin

Written by RAJU

Published on:

  • ట్రంప్-పుతిన్ మధ్య చెడుతున్న సంబంధాలు..!
  • తన గురించి పుతిన్‌కు తెలుసన్న ట్రంప్
  • తనకు కోపం తెప్పించే పనులు చేయొద్దని హితవు
US President Trump is indignant with Russian President Putin

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. నిన్నామొన్నటి దాకా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై గరం గరంగా ఉన్న ట్రంప్.. ఇప్పుడు డైరెక్షన్ మారింది. తాజాగా పుతిన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్‌పై ట్రంప్ కోపం ప్రదర్శించారు. ఉక్రెయిన్‌లో జెలెన్‌స్కీ పదవి నుంచి తప్పుకుంటేనే.. శాంతి చర్చలు జరుపుతానంటూ ఇటీవల పుతిన్ చేసిన వ్యాఖ్యలు ట్రంప్‌నకు తీవ్ర కోపం తెప్పించాయి.

ఇది కూడా చదవండి: RR vs CSK: మా ఓటమికి కారణం అదే: రుతురాజ్‌

ఉక్రెయిన్‌లో రక్తపాతాన్ని ఆపకపోతే రష్యాదే తప్పు అవుతుందన్నారు. ఒకవేళ రష్యా ఒప్పందం చేసుకోకపోతే భారీ స్థాయిలో చమురుపై సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. తన కోపం గురించి పుతిన్‌కు తెలుసని.. ఇప్పటికీ పుతిన్‌తో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. ఉక్రెయిన్ విషయంలో పుతిన్ మంచి నిర్ణయాలు తీసుకుంటే.. తన కోపం తగ్గుతుందని.. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ట్రంప్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Rohit Sharma: రోజురోజుకూ రోహిత్‌ ఆట పడిపోతోంది.. ఏదో నెట్టుకొస్తున్నాడు అంతే!

ఇటీవల అమెరికా మధ్యవర్తిత్వంతో సౌదీ అరేబియాలో రష్యాతో అమెరికా శాంతి చర్చలు జరిపింది. ఉక్రెయిన్‌లో 30 రోజుల కాల్పుల విరమణకు ప్రతిపాదన పెట్టింది. కానీ అందుకు రష్యా అంగీకరించలేదు. తమ షరతులు అంగీకరించాల్సిందేనని పేర్కొంది. ఈ చర్చలు జరుగుతుండగానే రష్యా దాడులకు తెగబడింది. తాజాగా జెలెన్‌స్కీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటేనే శాంతి చర్చలు జరుపుతానంటూ పుతిన్ తేల్చిచెప్పారు. ఇప్పుడు ఈ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఈ వ్యాఖ్యలే ట్రంప్‌నకు తీవ్ర కోపం తెప్పించాయి. ఏం జరుగుతుందో చూడాలి.

ఇదిలా ఉంటే అమెరికాతో అణు ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్ అంతుచూస్తామంటూ తాజాగా ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. అయితే ప్రత్యక్ష చర్చలకు మాత్రం ఇరాన్ అంగీకరించడం లేదు. పరోక్ష చర్చలకు మాత్రం అనుకూలం అంటోంది. సొంతంగా నిర్వహించుకునే అణు కార్యక్రమాలను అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమతోనే ఒప్పందం చేసుకోవాలంటోంది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇది కూడా చదవండి: UP: విషాదం.. అలహాబాద్ ఐఐఐటీ హాస్టల్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య

Subscribe for notification
Verified by MonsterInsights