UPSC Online : మరోసారి యూపీఎస్సీ సీఎస్‌ఈ 2025 దరఖాస్తు గడువు పొడిగింపు

Written by RAJU

Published on:

UPSC CSE 2025 Registration : యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సివిల్‌ సర్వీసెస్‌ 2025 దరఖాస్తు గడువును మరోసారి పొడిగించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

హైలైట్:

  • యూపీఎస్సీ సీఎస్‌ఈ 2025 ఎగ్జామ్‌
  • దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు
  • ఫిబ్రవరి 21 వరకు దరఖాస్తులకు ఛాన్స్‌

Samayam TeluguUPSC Online : మరోసారి యూపీఎస్సీ సీఎస్‌ఈ 2025 దరఖాస్తు గడువు పొడిగింపు
యూపీఎస్సీ సీఎస్‌ఈ 2025

UPSC CSE 2025 Last Date To Apply Extended Till February 21 : యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష దరఖాస్తుల గడువును యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) మరోసారి పొడిగించింది. ఆలిండియా సర్వీసుల్లో దాదాపు 979 పోస్టుల భర్తీ కోసం అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (CSE) 2025 పరీక్షకు జనవరి నెలలో నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. అనంతరం జనవరి 22న మొదలైన దరఖాస్తుల ప్రక్రియ తొలుత ఫిబ్రవరి 11వ తేదీతో ముగిసింది. అయితే.. అధికారులు తాజాగా దరఖాస్తు గడువును ఫిబ్రవరి 21వ తేదీ వరకు మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. UPSC తాజా నిర్ణయంతో అభ్యర్థులు ఫిబ్రవరి 21వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు. దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీ వరకు సవరించుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు యూపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు.. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (UPSC IFS 2025)లో మరో 150 పోస్టులకు సైతం దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 21వ తేదీ వరకు పొడిగించారు. అప్లయ్‌ చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆఖరి నిమిషం వరకు ఎదురుచూడకుండా ముందుగానే దరఖాస్తులు చేసుకోవాలని యూపీఎస్సీ సూచించింది. అప్లయ్‌ చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే. అలాగే.. పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌ https://upsc.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు.
కిషోర్‌ రెడ్డి

రచయిత గురించికిషోర్‌ రెడ్డికిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.
… ఇంకా చదవండి

Subscribe for notification