Unlawful Store: ఏపీ భవన్‌లో ‘కబ్జా దుకాణం’

Written by RAJU

Published on:


ABN
, Publish Date – May 04 , 2025 | 04:38 AM

పెద్ద ఎత్తున పైరవీలు చేయించాడు. షాప్‌ను తిరిగి తనకు అప్పగించాలంటూ ఏపీకి చెందిన కేంద్రమంత్రి, ఏపీ మంత్రి వద్ద తెలిసిన వ్యక్తుల ద్వారా ఒత్తిడి తెచ్చేందుకు యత్నించాడు.

Illegal Shop: ఏపీ భవన్‌లో ‘కబ్జా దుకాణం’

  • అతడి బాగోతం తెలియక తెలంగాణ ఎంపీ వత్తాసు

  • కొత్తగా కారులో షాపు..అక్కడే పార్కింగ్‌

న్యూఢిల్లీ, మే 3 (ఆంధ్రజ్యోతి): ఓ వ్యక్తి ఢిల్లీలోని ఏపీ భవన్‌లో అక్రమంగా దుకాణం నిర్వహిస్తున్నాడు! అదీ 20 ఏళ్లుగా! దుకాణం ముసుగులో అతడు అక్రమ వ్యవహారాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో రెండు నెలల క్రితమే ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ లవ్‌ అగర్వాల్‌ ఆ దుకాణాన్ని ఖాళీ చేయించగా.. పెద్ద ఎత్తున పైరవీలు చేయించాడు. షాప్‌ను తిరిగి తనకు అప్పగించాలంటూ ఏపీకి చెందిన కేంద్రమంత్రి, ఏపీ మంత్రి వద్ద తెలిసిన వ్యక్తుల ద్వారా ఒత్తిడి తెచ్చేందుకు యత్నించాడు. అసలు విషయం తెలుసుకున్న సదరు నేతలు జోక్యం చేసుకోవడానికి నిరాకరించారు.

అయితే భవన్‌లో ఎప్పుడూ సందడి చేసే తెలంగాణకు చెందిన సీనియర్‌ ఎంపీకి కొంతమంది తప్పుడు సమాచారం ఇవ్వడంతో ఆయన సదరు కబ్జాదారుడికి మద్దతు పలికారు. అయితే ఆ కమిషనర్‌ ఒత్తిడికి తలొగ్గక పోగా షాపునే కూల్చివేయించారు. అయినప్పటికీ సదరు కబ్జాదారుడు అక్కడికి ఓ కారు తెచ్చి.. అందులోనే కొత్త దుకాణాన్ని తెరిచాడు. పగలంతా దుకాణం నిర్వహిస్తూ రాత్రిళ్లు భవన్‌లోనే ఆ వాహనాన్ని పార్కింగ్‌ చేస్తుండడం గమనార్హం.

Updated Date – May 04 , 2025 | 04:38 AM

Google News

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights