Unity Drive: హైదరాబాద్ నుంచి స్పితి దాకా.. యూనిటీ డ్రైవ్ కాన్వాయ్! మే 9 నుంచి ప్రారంభం..

Written by RAJU

Published on:


Unity Drive: హైదరాబాద్ నుంచి స్పితి దాకా.. యూనిటీ డ్రైవ్ కాన్వాయ్! మే 9 నుంచి ప్రారంభం..

హైదరాబాద్, ఏప్రిల్ 8: వాటాబాటా లేకుండా వందల కొద్ది కిలోమీటర్లు ఒకే లక్ష్యం కోసం దేశాన్ని చుట్టేస్తోన్న వినూత్న యాత్ర.. ‘యూనిటీ డ్రైవ్ – యూనైటింగ్ ది నేషన్స్ ఆన్ వీల్స్’. వన్ సీ మీడియా ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ మహా ప్రస్థానం… మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమానత్వం వంటి అంశాలపై దేశవ్యాప్తంగా చైతన్యం రేపుతోంది.

ముంబైలో గ్రాండ్ లాంచ్

ఈ డ్రైవ్‌కి మహా ప్రారంభం ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, పర్యావరణ ఉద్యమకారులు… అందరూ ఈ ఉద్యమానికి జైకొట్టారు. శివసేన ప్రతినిధులు సిద్ధార్థ్ వాఘ్మారే, మకరంద్ పడే లాంటి నేతలు స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మద్దతు ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణ.

100 వాహనాల కాన్వాయ్ – చారిత్రాత్మక ర్యాలీ

హైదరాబాద్ నుంచి స్పితి వ్యాలీ దాకా ప్రయాణించనున్న ఈ కాన్వాయ్‌లో 100 వాహనాలు పాల్గొంటున్నాయి. ఇది కేవలం డ్రైవ్ కాదు. దేశ చరిత్రలో నిలిచిపోనున్న ఉద్యమం. ప్రతి నగరంలో… ప్రతి పట్టణంలో… మహిళల హక్కులు, పచ్చదనం ప్రాముఖ్యత, సమానత్వం అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

పచ్చదనానికి పెద్ద పీట

ఈ డ్రైవ్‌లో భాగంగా, వాతావరణ మార్పు ప్రభావాన్ని తగ్గించేందుకు వేల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నారు. ఇది కేవలం ఉద్యమం కాదు – భవిష్యత్ తరాల కోసం వేసిన బంగారు బాట.

సాంకేతికత, సమాజ సేవకు కళ్లెం

ఈ యాత్రకు ఏక్సిల్ ఏస్తటిక్స్, ఎక్స్విటెస్ బ్లాక్‌చెయిన్ లాంటి కార్పొరేట్ సంస్థలు తమ మద్దతు ప్రకటించాయి. వన్ సీ మీడియా (One sea ) ప్రతినిధి మాట్లాడుతూ – ‘ఇది కార్లు నడిపే ప్రయాణం కాదు. ఇది మనుషుల మనసులను కలుపే ఉద్యమం’ అని భావోద్వేగంగా వెల్లడించారు.

దేశవ్యాప్తంగా స్పందన – సోషల్ మీడియాలో ట్రెండింగ్

‘యూనిటీ డ్రైవ్’ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో #UnityDrive, #WheelsForChange లాంటి హ్యాష్‌ట్యాగ్లు ట్రెండింగ్లో ఉన్నాయి. యువత, కార్పొరేట్ సంస్థలు, సామాజిక సేవా సంస్థలు… అందరూ ఈ ప్రయాణానికి మద్దతు తెలుపుతున్నారు.

ఇది వందల కిలోమీటర్ల ప్రయాణం కాదు..

ఇది కోట్ల మంది హృదయాల ప్రేరణ ప్రయాణం. హైదరాబాద్ నుంచి ఈ డ్రైవ్ 2025 మే 9 నుంచి ప్రారంభంకానుంది. పర్యావరణ పరిరక్షణకూ, మహిళా సాధికారతకూ చక్రాలపై దారి వేసిన యూనిటీ డ్రైవ్ – చరిత్రలో నిలిచే ఉద్యమంగా మారుతోంది.

మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించండి.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights