- బేగంపేట్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించిన కిషన్ రెడ్డి
- రైల్వేలో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి- కిషన్ రెడ్డి
- రీసెంట్‌గా చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించుకున్నం- కిషన్ రెడ్డి
- త్వరలో బేగంపేట్ రైల్వే స్టేషన్‌ను ప్రారంభోత్సవం చేసుకుందాం- కిషన్ రెడ్డి.

బేగంపేట్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీంలో భాగంగా దేశవ్యాప్తంగా 1200 స్టేషన్లు ఆధునీకరణ చేస్తున్నారు. అందులో భాగంగా.. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లు, హైదరాబాద్‌లో 14 స్టేషన్లను కేంద్రం రీ డెవలప్మెంట్ చేస్తుంది. ఈ క్రమంలో.. రూ.27 కోట్లతో బేగంపేట్ రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేశారు. బేగంపేట్ రైల్వే స్టేషన్‌ను కిషన్ రెడ్డి పరిశీలించి.. అనంతరం మాట్లాడారు. రైల్వేలో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి.. రీసెంట్‌గా చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించుకున్నాం.. త్వరలో బేగంపేట్ రైల్వే స్టేషన్‌ను ప్రారంభోత్సవం చేసుకుందామని తెలిపారు.
Read Also: CM Revanth Reddy: బీఆర్ఎస్ వాళ్లకు గవర్నర్, మహిళల పట్ల గౌరవం లేదు..
కేవలం 5-10 శాతం పనులు మిగిలి ఉన్నాయి.. రూ.26 కోట్లతో మొదటి దఫా పనులు సాగుతున్నాయి.. రెండో దశలో రూ.12 కోట్లతో పనులు జరుగుతాయని కిషన్ రెడ్డి తెలిపారు. బేగంపేట్ రైల్వే స్టేషన్ చాలా అద్భుతంగా వచ్చింది.. ఒకప్పుడు రైల్వే స్టేషన్ అంటే ముక్కులు మూసుకుని రావాల్సి వచ్చేదని చెప్పారు. ఎక్కడ చూసినా కంపుతో నిండిపోయేది.. బాటిల్స్, చెత్త చెదారం ఉండేది.. వాటన్నింటినీ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మార్పులు చేస్తుందని పేర్కొన్నారు. కాగా.. బేగంపేట్‌లో ఉచిత వైఫై సౌకర్యం ఇవ్వబోతున్నాం.. పూర్తిగా మహిళలతో ఈ రైల్వే స్టేషన్ నడుపుతామని కిషన్ రెడ్డి చెప్పారు. మహిళా లోకానికి ఈ రైల్వే స్టేషన్‌ను అంకితం చేస్తామన్నారు. ఇక్కడ నుంచి ప్రతిరోజు 15 వేలమంది ప్రయాణం చేస్తున్నారు.. ఫస్ట్, సెకండ్ ఫేస్‌లు కలిపితే రూ.39 కోట్లతో బేగంపేట్ రైల్వే స్టేషన్ నీ తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.
Read Also: CM Chandrababu: ఏ ఊరికి వస్తానో చెప్పను.. క్లీన్‌గా లేకపోతే అంతే..! సీఎం స్వీట్ వార్నింగ్..
అలాగే.. కవచ్ టెక్నాలజీని ప్రయోగిస్తున్నాం.. కవచ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సికింద్రాబాద్‌లో రాబోతుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రమాదాలను అరికట్టేందుకు కవచ్‌ను ప్రారంభించబోతున్నామన్నారు. అంతేకాకుండా.. న్యూ ట్రాక్స్ నిర్మాణం కోసం రూ.39,300 కోట్లు ఖర్చు చేయబోతున్నాం.. 1,096 కిలోమీటర్లు ఎలక్ట్రిఫై చేశామని చెప్పారు. తెలంగాణలో 100 శాతం ఎలెక్ట్రిఫై చేశామని కిషన్ రెడ్డి అన్నారు. రైల్వే ట్రాక్స్ దగ్గర ప్రమాదాలు జరగకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. మరోవైపు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణం వేగవంతంగా సాగుతోంది.. వచ్చే ఏడాది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుందని వెల్లడించారు. ఎయిర్ పోర్ట్‌ను తలపించే విధంగా నిర్మాణం జరుగుతుందని అన్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌లో కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.. రానున్న ఐదేళ్లలో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు మారబోతున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. మరోవైపు.. చర్లపల్లి రైల్వే స్టేషన్‌కి అప్రోచ్ రోడ్డుకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి.. ముఖ్యమంత్రితో మాట్లాడాను.. ఇంకా కొలిక్కి రావాల్సి ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.